అల్లు అర్జున్ × త్రివిక్రమ్.. డబుల్ కిక్?

అందుకు అల్లు అర్జున్ నుంచి కూడా అతనికి మంచి సపోర్ట్ అయితే లభిస్తున్నట్లుగా తెలుస్తోంది

Update: 2024-04-30 06:59 GMT

గుంటూరు కారం సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాపై ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. ప్రొడక్షన్ హౌస్ హారిక హాసిని నుంచి చిన్న చిన్న లీకులు అందుతున్నప్పటికీ కూడా హీరోల దగ్గర నుంచి అయితే ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు అని అర్థమవుతుంది. ఇక త్రివిక్రమ్ అయితే నెక్స్ట్ తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు.

అందుకు అల్లు అర్జున్ నుంచి కూడా అతనికి మంచి సపోర్ట్ అయితే లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన కెరీర్ లో త్రివిక్రమ్ ఎక్కువగా అల్లు అర్జున్ తోనే మంచి సినిమాలు చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అల.. వైకుంఠపురములో.. అంటూ చేసిన మూడు సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ కాంబినేషన్ కు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది.

తప్పకుండా బన్నీ త్రివిక్రమ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తాడు అని అర్థమవుతుంది. ఇక లేటెస్ట్ గా అందుతున్న మరొక లీక్ ప్రకారం స్టోరీలో సరికొత్త ట్విస్టులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ను ఎదుర్కోవడానికి పవర్ఫుల్ విలన్ గా మరో అల్లు అర్జున్ నే దింపాలని అనుకుంటున్నారట. అది కూడా చాలా వైల్డ్ క్యారెక్టర్ గా ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అంటే డబుల్ యాక్షన్ తో అల్లు అర్జున్ ను రెండు విభిన్నమైన షేడ్స్ లో ప్రజెంట్ చేయనున్నారట. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇదివరకే ఫినిష్ అయ్యాయి. ఒకవైపు పాజిటివ్ గా కనిపిస్తూనే మరొక పాత్రలో చాలా వైల్డ్ గా కనిపించే విధంగా బన్నీ క్యారెక్టర్స్ ను హైలైట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాల్లో వీల్స్ రోల్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Read more!

ఇక ఈసారి హీరోకు, మరో హీరోనే విలన్ అయితే.. అనే పాయింట్ తో పవర్ఫుల్ కాన్సెప్ట్ ను టచ్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరొక అనౌన్స్మెంట్ అయితే రాబోతోంది. గీత ఆర్ట్స్ తో పాటు హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనుంది. అల.. వైకుంఠపురములో సినిమాను కూడా అదే తరహాలో నిర్మించిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు అట్లీ కూడా అతనితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. మరి ఈ బిజీబిజీ ప్లానింగ్ లో త్రివిక్రమ్ కు ఎప్పుడు చాన్స్ దొరుకుతుందో చూడాలి.

Tags:    

Similar News