• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్.. ఆ కథను...

త్రివిక్రమ్.. ఆ కథను పక్కన పెట్టేసి..

| మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల గుంటూరు కారం సినిమాతో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ అందుకోలేకపోయాడు.

By - Tupaki Desk
Update: 2024-02-13 08:30 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల గుంటూరు కారం సినిమాతో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ అందుకోలేకపోయాడు. మహేష్ స్టార్ ఇమేజ్ కారణంగా సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఇక ఓటీటీ లో కూడా సినిమాకు పరవాలేదు అనే విధంగా రెస్పాన్స్ అయితే వస్తోంది. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు తను తదుపరి ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాడు.

త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లుఅర్జున్ తో చేయబోతున్నట్లుఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఈ కాంబినేషన్ వాయిదా పడే అవకాశం ఉందని కూడా గాసిప్స్ వచ్చాయి. అయితే మళ్లీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను లైన్లోకి తీసుకువచ్చినట్లుగా కొత్త టాక్ అయితే వైరల్ అవుతుంది. ఇక త్రివిక్రమ్ కు పోటీగా మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఉన్నాడు. అతడు కూడా అల్లు అర్జున్ కోసం పవర్ఫుల్ మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

ఇక అల్లు అర్జున్ ను ఎవరైతే ముందుగా కధతో మెప్పిస్తారో వాళ్లే ప్రాజెక్టును మొదట స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ మరో ఫ్యామిలీ కథతోనే ప్రేక్షకుల ముందుకు రావాలి అని అనుకున్నాడు. హీరో ఫ్యామిలీ విడిపోవడంతో మళ్లీ ఎలాగైనా అందరిని కలపాలి అని పాయింట్ తో అసలు కథను సిద్ధం చేసుకున్నారట. కామెడీతోపాటు మంచి ఎమోషన్స్ ఉండేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే అల్లు అర్జున్ రేంజ్ ప్లాన్ ఇండియా స్థాయికి పెరిగిపోవడం వలన అలాంటి కథలు చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సల్ కాన్సెప్ట్ ఉండేలా పెన్ను పదును పెంచుతున్నట్లు టాక్. అసలే పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ అందుకోవాలి అని బన్నీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ నుంచి వచ్చే ప్రాజెక్టు కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే భారీ స్థాయిలోనే కథను సిద్ధం చేసుకోవాలి అని త్రివిక్రమ్ కు సూచించినట్లుగా తెలుస్తోంది. మరి ఆ అంచనాలకు తగ్గ కథను మాటల మాంత్రికుడు ఏ స్టైల్లో సిద్ధం చేస్తాడో చూడాలి.

Tags:    
  • Trivikram 
  • Alluarjun 
  • Gunturkaraam 
  • Maheshbabu 
  • Panindia 
  • Pushpa2 
  • Sukumar 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS