• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీరమల్లు కోసం...

వీరమల్లు కోసం త్రివిక్రమ్.. ఒక్కొక్కరు ఒక్కోలా..

| టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు మూవీ ఇప్పుడు చివర దశలో ఉన్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-06 06:39 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు మూవీ ఇప్పుడు చివర దశలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ కు మేకర్స్ గుమ్మడికాయ కొట్టేసినట్లు తెలుస్తోంది. మే 30వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసినా.. దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు వీరమల్లు షూటింగ్ చివరి రెండు రోజులు.. సెట్స్ లో త్రివిక్రమ్ కనిపించారు. ఆయన డైరెక్షన్ ను పర్యవేక్షించారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే వీరమల్లుకు ముగ్గురు డైరెక్టర్స్ అయినట్లే. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ క్రిష్.. సినిమాను 80 శాతం పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన తప్పుకోగా జ్యోతికృష్ణ బాధ్యతలు తీసుకున్నారు.

ఇప్పుడు త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఆయన, పవన్ మంచి క్లోజ్ ఉన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ సినిమాల్లో త్రివిక్రమ్ హ్యాండ్ ఏదో ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్నేహధర్మంతో వీరమల్లు దర్శకత్వ పర్యవేక్షణ చేశారని టాక్. ప్రస్తుతం ఆ విషయం వైరల్ గా మారగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

నిజానికి వీరమల్లు ప్రాజెక్టు చాలా ఏళ్ల క్రితం మొదలైంది. కానీ అనేక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. బజ్ కాస్త తగ్గినా.. ఫ్యాన్స్ మాత్రం ఇంట్రెస్ట్ తో ఉన్నారు. మరికొందరు మాత్రం అవుట్ పుట్ పై హోప్స్ లేవ్ అంటున్నారు. అలాంటి సమయంలో త్రివిక్రమ్.. హ్యాండ్ వేయడం మంచిదేనని కొందరు చెబుతున్నారు.

మరికొందరు మాత్రం.. మూవీ అవుట్ పుట్ తేడా కొడితే త్రివిక్రమ్ కు పెద్ద తలనొప్పిగా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే ఆయన గత మూవీ గుంటూరు కారం విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో డైరెక్టర్లు ఎక్కువ మంది అయితే ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.

ఏదేమైనా బిజీగా ఉన్నా.. త్రివిక్రమ్ పవన్ కోసం రంగంలోకి దిగినట్లు అర్థమవుతోంది. ఓవైపు ఆయన బన్నీ ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు మరో బడా సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్.. వీరమల్లు వర్క్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    
  • HariHaraVeeraMallu 
  • PawanKalyan 
  • Trivikram 
  • Krish 
  • JyothiKrishna 
  • TollywoodUpdates 
  • PowerStar 
  • VeeraMallu 
  • TeluguCinema 
  • UpcomingMovies 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS