వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తున్నారా?

కొంత కాలంగా ఇద్ద‌రు బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న పాత ఈగోల‌ను ప‌క్క‌న‌బెట్టి ప్రెండ్లీగా మెలుగుతున్నారు.;

Update: 2025-06-08 03:30 GMT

త్రిష‌-న‌య‌న‌తార మ‌ధ్య ఒక‌ప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది. అవ‌కాశాల ప‌రంగా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన పోటీ? అటుపై వ్యక్తిగ‌త పోటీగా మారింది. కొన్నాళ్ల పాటు త‌గ్గాఫ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగింది. కానీ కాలం అన్నింటికి ఓ ప‌రిష్కారం చూపిస్తుంది అన్న‌ట్లు వాళ్ల వివాదానికి ఓ ప‌రిష్కారంతో పుల్ స్టాప్ ప‌డేలా చేసింది. కొంత కాలంగా ఇద్ద‌రు బాగానే మాట్లాడుకుంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న పాత ఈగోల‌ను ప‌క్క‌న‌బెట్టి ప్రెండ్లీగా మెలుగుతున్నారు.

అయితే వాళ్లిద్ద‌రి మ‌ధ్య పుల్ల‌లు పెట్టే బ్యాచ్ మాత్రం ఒక‌టి త‌యారైంద‌ని కోలీవుడ్ మీడియాలో వార్త‌లొ స్తున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన `థ‌గ్ లైఫ్` లో త్రిష సెకెండ్ లీడ్ పోషించిన సంగ‌తి తెలిసిందే. సినిమా ఎలా ఉంది? అన్న సంగ‌తి ప‌క్క‌న‌బెడితే త్రిష పాత్ర‌ను నెగిటివ్ చేసే ప్ర‌చారం మొద‌లు పెట్టారు. సినిమా లో త్రిష పాత్ర కీల‌క‌మైంది. అమ‌ర్ ( శింబు) చెల్లులు ఎవ‌రు? అన్న దానిపై ఇంద్రాణి(త్రిష‌), చంద్ర ( ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) పాత్ర‌ల మ‌ధ్య కొంత స‌స్పెన్స్ న‌లుగుతుంది.

ఆ ర‌కంగా త్రిష పాత్ర‌ బ‌ల‌మైంది. కానీ ఈ సినిమా అంగీక‌రించి త్రిష త‌ప్పుచేసింద‌ని నెగిటివ్ ప్ర‌చారం మొద‌లైంది. త్రిష కూడా రియ‌లైజ్ అవుతుంద‌ని క‌థ‌నాలు అల్లుతున్నారు. తొలుత ఈ పాత్ర న‌య‌న‌తార వ‌ద్ద‌కు వ‌చ్చినా? ఆమెకు న‌చ్చ‌క‌పోవ‌డంతోనే చేయ‌లేద‌నే టాక్ ఉంది. ఆమె వ‌దిలేసింది కాబ‌ట్టే త్రిష‌కు ఛాన్స్ వ‌చ్చింద‌ని న‌య‌న్ కోలీవుడ్ వ‌ర్గం ఆరోపిస్తుంది. త్రిష‌ను డీగ్రేడ్ చేసే ప్ర‌య‌త్నానికి తెర తీసారు.

త్రిష అభిమానులు మాత్రం న‌య‌న్ అభిమానుల‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు. దీంతో మ‌ర్చిపోయిన పాత వివాదాల్ని అభిమానుల కార‌ణంగా మ‌ళ్లీ బ‌య‌ట ప‌డ‌తాయా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయినా అబ‌ద్దాల‌తో క‌ట్టిన పేక మేడ ఎంత కాలం ఉంటుంది. ఏదో రోజు అది కూల‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News