ప‌సుపు చీర‌లో ఏజ్‌లెస్ క్వీన్ త్రిష కృష్ణ‌న్

దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న పాపుల‌ర్ నటి త్రిష కృష్ణన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Update: 2026-08-16 17:52 GMT

దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న పాపుల‌ర్ నటి త్రిష కృష్ణన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయబద్ధమైన పసుపు రంగు చీర ధరించి దేవకన్యలా మెరిసిపోతున్న తన ఫోటోల‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. విశేషమేమిటంటే ఆ చీర తన తల్లిదేనని తెలిపి అభిమానులను మురిపించారు. ఈ రాయల్ లుక్‌లో త్రిషను చూసిన అభిమానులు, నెటిజన్లు `ఏజ్‌లెస్ క్వీన్` అని ప్రశంసిస్తున్నారు.




 


నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నా త్రిష గ్లామర్ లో కించిత్ కూడా మార్పు రాలేదని.. రోజురోజుకూ ఆమె మరింత అందంగా తయారవుతున్నారని అభిమానులు మురిసిపోతున్నారు. నటి ఖుష్బూ సుందర్, ఐశ్వర్య కల్పాతి సహా పలువురు సినీ ప్రముఖులు త్రిష అలంకరణకు.. త‌న అంద‌మైన‌ రూపానికి ఫిదా అయిపోయి ప్రశంసలను కురిపించారు. కొందరు నెటిజన్లు త్రిష‌ క్లాసిక్ సినిమాల్లోని డైలాగులను గుర్తుచేసుకుంటూ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తెచ్చారు.




 


మరోవైపు ఈ పోస్ట్ కింద నెటిజన్ల మధ్య తీవ్రమైన రాజకీయ, వ్యక్తిగత చర్చలు కూడా వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ సార‌థ్యంలోని పొలిటికల్ మీటింగ్‌లు లేదా తమిళనాడు ప్రభుత్వ సభల్లో త్రిష కనిపించడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అభిమానులు త్రిష‌ను సరదాగా విజ‌య్ కి చెల్లెలు(తంగచ్చి) అంటూ పోల్చగా.. మరికొందరు మాత్రం విజయ్ రాజకీయ భవిష్యత్తును.. ఆయన భార్య సంగీతను ప్రస్తావిస్తూ త్రిష‌ ఇటువంటి పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటేనే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.




 


ఈ చర్చల నడుమ మరికొందరు నెటిజన్లు నటుడు శింబు (మాజీ ప్రియుడిగా ప్ర‌చారం ఉంది) పేరును తెరపైకి తెచ్చారు. విజయ్ పొలిటికల్ ఇమేజ్‌ను ఇబ్బంది పెట్టకుండా.. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న శింబును త్రిష పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ విమర్శనాత్మకంగా.. సరదాగా సలహాలు ఇవ్వడం కనిపించింది. వీటికి తోడు గిల్లి, లియో చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్‌ను ప్రస్తావిస్తూ వారి ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీపై నెటిజన్లు రకరకాల విశ్లేషణలు చేశారు.




 


ఏది ఏమైనా తన అందంతో నెటిజన్లను కట్టిపడేస్తూనే... సోషల్ మీడియా వేదికగా నిరంతరం చర్చల్లో నిలవడం త్రిష ప్రత్యేకత. ఒకవైపు సౌత్ ఇండస్ట్రీలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ఈ త‌మిళ తంగం.. మరోవైపు సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ ద్వారా కోట్లాది మంది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వివాదాలు, విమర్శలు ఎలా ఉన్నా త్రిష పసుపు చీర లుక్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్‌గా మారింది.

Tags:    

Similar News