ఆయ‌న‌తో హ్యాట్రిక్ త్రిష‌కే సొంతం!

మ‌ణిసార్ త్రిష‌కి ఎంత‌గా ప్రాముఖ్య‌త ఇచ్చారంటే? ఏకంగా ఆమె పేరిట ఓ ట్రాక్ రికార్డులా నిలిచేలా ఛాన్స్ ఇచ్చారు.;

Update: 2025-04-22 09:30 GMT

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో చాలా మంది హీరోయిన్లు సినిమాలు చేసారు. అందులో ఫేమ‌స్ అయిన రీపీటెడ్ హీరోయిన్లు కొంద‌రున్నారు. కాంబినేష‌న్ సెట్ అయిందంటే? రిపీట్ చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. అలాగే చాలా మంది కొత్త న‌టీన‌టుల‌తోనూ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్లు ఎన్నో చేసారు. కానీ వీళ్లంద‌రిలో స్పెష‌ల్ ఎవ‌రు? అంటే అందాల త్రిష అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌ణిసార్ త్రిష‌కి ఎంత‌గా ప్రాముఖ్య‌త ఇచ్చారంటే? ఏకంగా ఆమె పేరిట ఓ ట్రాక్ రికార్డులా నిలిచేలా ఛాన్స్ ఇచ్చారు. వ‌రుస‌గా మ‌ణిర‌త్నంతో ఎలాంటి గ్యాప్ లేకుండా హ్యాట్రిక్ సినిమాలు చేయడం అన్న‌ది ఆమెకే చెల్లింది. వివ‌రాల్లోకి వెళ్తే మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియ‌న్ సెల్వ‌న్` రెండు భాగాలుగా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులోచాలా మంది న‌టీన‌టులు న‌టించారు. అలాగే త్రిష కూడా సినిమాలో భాగ‌మే.

రెండు భాగాల్లోనూ న‌టించింది. రెండు భాగాలు మంచి విజ‌యం సాధించాయి. సినిమాలో త్రిష‌ను మ‌రింత అందంగా హైలైట్ చేసారు. తాజాగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `థ‌గ్ లైఫ్` లోనూ త్రిష హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. ఇలా వ‌రుస‌గా మ‌ణి ర‌త్నంతో మూడు సినిమాలు చేయ‌డం త్రిష‌కే సాధ్య‌మైంది. ఇంత వ‌ర‌కూ ఈ ఆర్డ‌ర్ లో ఏ హీరోయిన్ ప‌ని చేయ‌లేదు.

దీంతో త్రిష పేరిట ఇదో రికార్డులా నిలిచింది. అలాగే అమ్మ‌డికి సెకెండ్ ఇన్నింగ్స్ కీల‌క పాత్ర ధారిగాను మ‌ణిసార్ నిలిచారు. స‌రిగ్గా అవ‌కాశాలు లేని స‌మ‌యంలో త్రిష‌ని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసి సెకెండ్ ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపిస్తున్నారు. ఆ ర‌కంగా త్రిష ఎప్ప‌టికీ మ‌ణిర‌త్నం కృత‌జ్ఞ‌తురాలే.

Tags:    

Similar News