త్రిష కోసం తాజ్మహల్ ని మించిన ప్రేమ మందిరం!
కానీ దాన్ని నేను భౌతికంగా చూపించలేను. అది జరగాలంటే తాజ్ మహల్ ని మించిన మరో మందిరం కట్టాల్సిందే నేను.;
అందాల త్రిష గురించి చెప్పాల్సిన పనిలేదు. అమెను అభిమానించే వారెంతో మంది. ఆమె అందానికి ఫిదా కానిదెవరు. అమ్మడు నాలుగు పదుల వయసుదాటినా? ఇప్పటికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తుంది. వయసు తో పాటు అందం పెరిగిపోతుందా? అన్న సందేహం రాకమానదు. ఇంకా 30 ఏళ్ల బ్యూటీలా కవ్విం చేస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన అవకాశాలు అందుకుంటుంది అంటే? ఆ అందం కూడా ఓ కారణమే కదా.
అమ్మడు సరసన నటించాలంటే కొన్ని అర్హతులుండాలంటూ కేవలం సీనియర్ హీరోలకు జోడీగా మాత్రమే నటిస్తోంది. యంగ్ హీరోలకు నో ఛాన్స్ అంటోంది. కోలీవుడ్..టాలీవుడ్ లో ఇదే రూల్ తో పని చేస్తోంది. ఇటీవవలే మాలీవుడ్ లో కూడా లాంచ్ అయింది. అక్కడా సీనియర్లకు మాత్రమే ఛాన్స్ అంటోంది. ఇటీవలే అమ్మడు 42 ఏటలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా త్రిష అందాన్ని పొగిడేస్తూ ఓ నెటి జనుడు మనసులో ప్రేమను బయట పెట్టాడు.
సాధారణంగా సోషల్ మీడియా వేదిగాక త్రిష ఎన్నో లవ్ ప్రపోజల్స్ చూసి ఉంటుంది. కానీ ఈ ప్రపోజల్ మాత్రం త్రిష తప్పక అంగీకరించాల్సిందే అంత ప్రేమను కురిపించాడు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్ మహాల్ ని కట్టారు. కానీ దాన్ని తలదన్నేలా అంతకు మించిన గొప్ప ప్రేమ మందిరం ఉందని ఓ గుడి కట్టాలని ఉంది. ఇప్పటికే నా మనసులో అంతకు మించిన గొప్ప మందిరం కట్టేసాను.
కానీ దాన్ని నేను భౌతికంగా చూపించలేను. అది జరగాలంటే తాజ్ మహల్ ని మించిన మరో మందిరం కట్టాల్సిందే నేను. అది ఈ జన్మలో సాధ్యం కాకపోయినా వచ్చే జన్మలోనైనా తప్పక కడతానంటూ మన సులో ప్రేమను వ్యక్తం చేసాడు. మరి ఈ పోస్ట్ త్రిష చూసిందంటే? ఆమె కూడా అంగీకరిస్తుందేమో.