'స్పిరిట్' బ్యూటిఫుల్ ఫిలిమ్.. పుండు మీద కారం చల్లిన ట్రిప్తి!
స్పిరిట్ కాస్టింగ్ ఎంపిక విషయంలో దీపికతో సందీప్ వంగా విభేధాల గురించి చాలా చర్చ సాగుతోంది.;
స్పిరిట్ కాస్టింగ్ ఎంపిక విషయంలో దీపికతో సందీప్ వంగా విభేధాల గురించి చాలా చర్చ సాగుతోంది. దీపిక యారొగెన్సీ కారణంగా అవకాశం కోల్పోయిందని చాలా మంది భావిస్తున్నారు. ఇది కేవలం ఎనిమిది గంటల పనిదినం లేదా అదనపు పారితోషికం, లాభాల్లో వాటా కోరడం వంటి చిన్న విషయాలే కాదు... అంతకుమించి దీపిక ఫెమినిజాన్ని, బాసిజాన్ని ప్రదర్శించి చివరికి గొప్ప అవకాశం కోల్పోయిందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగానే పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు ట్రిప్తి దిమ్రీ లైన్ లో కొచ్చింది. ఈ బ్యూటీ చాలా సింపుల్ గా స్పిరిట్ గురించి ఒక కామెంట్ చేసింది. స్పిరిట్ బ్యూటిఫుల్ ఫిలిం! ఇందులో నేను నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మరో సౌత్ హీరో విశాల్ సరసన నటిస్తున్నానని పేర్కొన్న ట్రిప్తి దిమ్రీ, ఆ సినిమా రిలీజ్ కి వస్తున్నందున దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టానని తెలిపింది.
ఆ తర్వాత `వంగాస్ స్పిరిట్`లో నటిస్తున్నానని తెలిపిన ట్రిప్తి, ఇది `బ్యూటిఫుల్ ఫిలిం` అని పేర్కొంది. ఇదివరకూ వచ్చిన కథనాల ప్రకారం.. సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాత ప్రణయ్ వంగా ఇప్పటికే దీనిని ఖరారు చేసారు. తాజా ఇంటర్వ్యూలో దీపిక ఎగ్జిట్ కి కారణం ఏమిటో ప్రస్థావించకుండానే .. ``బ్యూటిఫుల్ ఫిలింలో దీపిక అవకాశం కోల్పోయింద``ని చెప్పకనే చెప్పింది ట్రిప్తి దిమ్రీ.