త్రినాధరావు నక్కిన ఇంట్రెస్టింగ్ లైనప్!
తాజాగా ఆయన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. నక్కిన నరేటివ్ బ్యానర్ స్థాపించి కొత్త వాళ్లకు అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాడు.;
త్రినాధరావు నక్కిన పరిచయం అవసరం లేని పేరు. 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', హలో గురు ప్రేమ కోసమే', 'ధమాకా' లాంటి కమర్శియల్ సక్సెస్ తో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. లవ్ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్లతో కమర్శియల్ సక్సెస్ లు అందుకోవడంలో స్పెషలిస్ట్. తాజాగా ఆయన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. నక్కిన నరేటివ్ బ్యానర్ స్థాపించి కొత్త వాళ్లకు అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాడు.
తొలి ప్రయత్నం 'చౌర్య పాఠం' అనే సినిమా నిర్మిస్తున్నారు. సినిమాల్లో సంపాదించింది ఇక్కడే పెట్టుబడి పెట్టి నలుగురుకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో ముందుకు కదులుతున్నారు. డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో నిర్మాతగాను సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. బ్యాకెండ్ లో ఆయన కూడా క్రియేటివ్ భాగంలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆ రకమైన ఇబ్బందులుండవు. పర్పెక్ట్ స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకుంటాడు.
అయితే 'ధమాకా' తర్వాత దర్శకుడిగా ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. మరి త్రినాధరావు తదుపరి సినిమాలు ఎవరితో? అంటే ఇంట్రెస్టింగ్ లైనప్ బయటకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ , శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ లో కమిట్ మెంట్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఆయన చిన్న సంస్థల్లోనే పనిచేసారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థలకు ప్రమోట్ అవ్వడంతో? ఆయన సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతుందని తెలుస్తోంది.
త్రినాధరావు కథలు భారీ బడ్జెట్ తో ఉండవు. సింపుల్ స్టోరీని కమర్శియల్ గా సక్సెస్ చేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి హిట్లు ఇచ్చిన వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. తాజాగా కమిట్ అయినవన్నీ అగ్ర బ్యానర్లు కాబట్టి వాటిలో హీరోలు ఎవరవుతారు? అన్నది తేలాలి. రవితేజ , నాని తప్ప ఇంతవరకూ స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేయలేదు. తాజాగా ఆ ఛాన్స్ ముందున్నట్లు చెప్పొచ్చు.