త్రిబంధారి బర్బరిక్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ!
తెలుగు చిత్ర పరిశ్రమలో భిన్నమైన కథాంశాలతో, విభిన్నమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల మదిలో నిలిచే సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి.;
తెలుగు చిత్ర పరిశ్రమలో భిన్నమైన కథాంశాలతో, విభిన్నమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల మదిలో నిలిచే సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. అలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో తాజాగా మంచి హైప్ సంపాదించుకుంటున్న చిత్రం త్రిబంధారి బర్బరిక్. మొదటి గ్లింప్స్ నుంచే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సత్యరాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ ప్రధాన పాత్రలో నటించడం సినిమాపై అంచనాలు పెంచింది. బాహుబలి లో కట్టప్పగా అందరినీ మెప్పించిన సత్యరాజ్, ఈసారి బర్బరిక్ పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు.
చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రతిదీ కూడా మంచి ఆదరణ తెచ్చుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాటలో ఉదయ భాను గ్లామర్ లుక్, రాహుల్ సిప్లిగుంజ్ వాయిస్, ఇన్ఫ్యూషన్ బ్యాండ్ మ్యూజిక్‌తో పాటకు అదనపు ఆకర్షణ వచ్చింది. ఈ స్పెషల్ నెంబర్ సినిమాపై మరింత హైప్ ను తీసుకువచ్చింది.
ఇలాంటి బజ్ మధ్య, మేకర్స్ సినిమాను ఆగస్టు 22న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకొద్ది రోజుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందున ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడంతో, సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని డేస్ లోనే కొత్త అప్‌డేట్స్ అందించబోతున్నారని సమాచారం.
త్రిబంధారి బర్బరిక్ సినిమాలో ప్రముఖ నటులు సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ఠ ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, వీటీవీ గణేశ్, మోట్టా రాజేంద్రన్, మేఘనా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉదయ భాను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంది. ఆమె క్యారెక్టర్ స్టోరీలో మరింత థ్రిల్ కలిగించనుందని యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాకు కథ, దర్శకత్వ బాధ్యతలు మోహన్ శ్రీవత్సా వహించారు. విజయ్‌పాల్ రెడ్డి ఆదిధాల నిర్మాణంలో వనర సెల్యులోయిడ్ బ్యానర్ పై తెరకెక్కింది. మారుతి టీమ్ ప్రొడక్ట్‌గా ఇది ప్రెజెంట్ అవుతోంది. సినిమాటోగ్రఫీ కుషేందర్ రమేష్ రెడ్డి, మ్యూజిక్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ బాధ్యతలు చేపట్టారు. సినిమా సాంకేతికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, త్రిబంధారి బర్బరిక్ ఆగస్టు 22న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఇక సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో ఎంతవరకు హిట్ టాక్ అందుకుంటుందో చూడాలి.