ఒకే ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అంతమందా..
సౌత్ లో ఓ ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్లు, ఓ ప్రముఖ డైరెక్టర్, ఓ కెమెరామెన్ ఇండస్ట్రీకి వచ్చి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.;
ఇండియాలో బిజినెస్ నుంచి పాలిటిక్స్ వరకు ప్రతీ రంగంలోనూ కుటుంబ ఆధిపత్యం కనిపిస్తుంటుంది. సినీ ఇండస్ట్రీలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది నటులు, నిర్మాతలు, డైరెక్టర్లు, డ్యాన్సర్లు, సింగర్లు తమ ఫ్యామిలీని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చి సినీ ఫ్యామిలీలుగా రాణించాలని చూస్తుంటారు. బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువ. సౌత్ లో కూడా అలాంటి ఫ్యామిలీలున్నాయి. సౌత్ లో ఓ ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్లు, ఓ ప్రముఖ డైరెక్టర్, ఓ కెమెరామెన్ ఇండస్ట్రీకి వచ్చి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
పార్వతి కళ్యాణం సినిమాతో ధనలక్ష్మి ఎంట్రీ
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇది మాత్రం ముమ్మాటికీ నిజమే. ఆ ఫ్యామిలీ మరెవరిదో కాదు, టీఆర్ రాజకుమారి గారిది. రాజకుమారి నాయనమ్మ గుజ్జలాంబాళ్ పాపులర్ కర్ణాటిక్ సింగర్. తన సంతానమే ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయగలిగారు. ఈ ఫ్యామిలీ నుంచి ముందుగా ఎస్‌పీఎల్ ధనలక్ష్మి, పార్వతి కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ధనలక్ష్మి సోదరి తమయంతి కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
కోలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా రాజకుమారి
తర్వాత ధనలక్ష్మి సోదరి కూతురు రాజయ అలియాస్ రాజకుమారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రముఖ డైరెక్టర్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్లినప్పుడు అతను అక్కడ రాజయను చూసి ఆమెను హీరోయిన్ గా మార్చి కచ్ఛ దేవయాని సినిమాతో రాజకుమారిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కోలీవుడ్ కు డ్రీమ్ గర్ల్ గా మారి ఎంతో సక్సెస్ అయిన రాజకుమారి ఫ్యామిలీ నుంచి మరికొందరు ఇండస్ట్రీలోకి వచ్చారు. వాళ్లే టీఆర్ రామన్న. ఈయన ఎవరో కొత్తగా చెప్పేపన్లేదు. ఎంజీఆర్, శివాజీ లాంటి స్టార్లతో సినిమా చేసిన ఏకైక నిర్మాతగా ఈయనకు మంచి పేరుంది. ఆ తర్వాత రాజకుమారి కోడలు కుశల కుమారి కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.
500 సినిమాలతో జయమాలిని రికార్డు
ఆ తర్వాత తరం హీరోయిన్లుగా ధనలక్ష్మి కూతుళ్లు ఇండస్ట్రీలోకి వచ్చారు వారే జ్యోతి లక్ష్మి, జయమాలిని. ఇద్దరూతమ గ్లామర్ తో మంచి డ్యాన్సులు చేసి ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. జ్యోతి లక్ష్మి 300 సినిమాలు చేయగా, జయమాలిని 500 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. వారి తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి ఆఖరి తరంగా జ్యోతి మీన వచ్చారు. పలు హీరోల సరసన నటించిన ఆమె కొన్ని సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించారు. జ్యోతి మీనా తండ్రి కూడా ఇండస్ట్రీలో కెమెరా మ్యాన్ గా వర్క్ చేశారు. ఇలా మొత్తానికి ఒకే ఫ్యామిలీ నుంచి ఎంతో మంది తమిళ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా ఓ వెలుగు వెలుగుతూ వస్తోంది. సౌత్ లో ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది ఇండస్ట్రీకి వచ్చారని చాలా తక్కువ మందికే తెలుసు.