'టాక్సిక్' ఈవెంట్‌లో భామల కిల్లింగ్.. న‌య‌న్ మిస్సింగ్ కార‌ణం?

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

Update: 2026-08-22 17:27 GMT

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరాగా.. చిత్రంలోని కథానాయికలు తమ గ్లామరస్ అప్పీరియన్స్‌తో ఈవెంట్‌ను మరింత వర్ణరంజితంగా మార్చేశారు. ముఖ్యంగా వేదికపై మెరిసిన కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తమ అందచందాలతో అభిమానులను కట్టిపడేసారు.

ఇటీవల బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచి `షో స్టాపర్`గా ప్రశంసలు అందుకున్నారు. అక్కడ కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి యంగ్ హీరోయిన్లు ఉన్నా నయన్ తనదైన గ్రేస్‌తో అందరినీ డామినేట్ చేశారు. అయితే హైదరాబాద్‌ మల్లా రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముగ్గురు భామలు సందడి చేసినా నయనతార మిస్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.

హైదరాబాద్ ఈవెంట్‌లో హాజరైన కియారా, హుమా, రుక్మిణి తమ అందమైన - ట్రెండీ డ్రెస్సింగ్ సెన్స్‌తో వేదికను వేడెక్కించారు. డార్క్ థీమ్డ్ డ్రెస్సింగ్‌లో ఈ ముగ్గురు భామలు మెరిసిపోతూ.. ఫ్యాన్స్ కళ్లు తిప్పుకోనివ్వని విజువల్ ట్రీట్‌ను అందించారు. వేడుకలో వీరి ఫ్యాషన్ స్టేట్‌మెంట్ - స్టైలిష్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారాయి.

స్టార్ హీరోయిన్ నయనతార ఫ్యాషన్ సెన్స్, డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడూ వేరే లెవెల్‌లో ఉంటాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ వేదికకు నయన్ రాలేకపోయారని నిర్మాత కేవీఎన్ ప్రత్యేకంగా వెల్లడించారు. అంతటి అగ్ర నిర్మాత సభాపూర్వకంగా నయనతారను గుర్తుచేసుకోవడం త‌న‌కు ఉన్న క్రేజ్ .. ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. `దట్ ఈజ్ తలైవి రేంజ్` అంటూ అభిమానులు కూడా వేడుకలో నయన్ పేరును గుర్తుచేసుకున్నారు. ఇక ఈ వేదిక‌కు న‌య‌న‌తార రాలేక‌పోయార‌ని నిర్మాత కేవీఎన్ తెలిపారు.

మొత్తానికి `టాక్సిక్` హైదరాబాద్ ఈవెంట్ కథానాయికల గ్లామర్‌తో పాటు.. నిర్మాత దిల్ రాజు, కథానాయకుడు యష్ ప్రసంగాలతో అత్యంత ఘనంగా ముగిసింది. నయనతార గైర్హాజరీ లోటు ఉన్నా.. కియారా, హుమా, రుక్మిణిల సందడితో ఈవెంట్ సూపర్ హిట్ అయింది. ఈ వేడుకతో తెలుగు రాష్ట్రాల్లో `టాక్సిక్` చిత్రంపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

Tags:    

Similar News