• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2024లో టాప్- 5 సెల‌బ్రిటీ...

2024లో టాప్- 5 సెల‌బ్రిటీ జంట‌ల బ్రేక‌ప్

| 2024లో ఇప్పటివరకు విడాకుల‌తో దూర‌మైన జంట‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-07-21 03:45 GMT

2021లో నాగ‌చైత‌న్య‌- స‌మంత‌.. అమీర్ ఖాన్ - కిర‌ణ్ రావు వంటి ప్ర‌ముఖ జంట‌లు విడిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోయారు. దానికి కొన‌సాగింపుగా చాలా విడాకులు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. 2024లోను వినోద ప‌రిశ్ర‌మ సెల‌బ్రిటీ క‌పుల్స్ గురించి విన‌కూడ‌నివి కొన్ని వినాల్సి వ‌చ్చింది. కొన్ని బ్రేక‌ప్ లు హృద‌యాల్ని క‌దిలించాయి. బాలీవుడ్ తారలు, టెలివిజన్ ప్రముఖులు బంధాలు చితికిపోయాయి. 2024లో ఇప్పటివరకు విడాకుల‌తో దూర‌మైన జంట‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1. ఈషా డియోల్ - భారత్ తఖ్తానీ


బాలీవుడ్ నటి ఈషా డియోల్ డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని- ధ‌ర్మేంద్ర‌ల కుమార్తె. వ్యాపారవేత్త భరత్ తఖ్తానీ నుంచి ఇషా విడిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఈ జంట 29 జూన్ 2012న ముంబైలోని ఇస్కాన్ దేవాలయంలో పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు.. రాధ్య- మీరయా ఉన్నారు.

ఈషా- భరత్ ఉమ్మడి ప్రకటన ద్వారా తాము విడిపోయినట్లు ప్రకటించారు. వారు తమ పిల్లలను సామరస్యపూర్వకంగా సహ-తల్లిదండ్రులుగా ఉంటామ‌ని తెలిపారు. ఈ సవాల్‌ సమయంలో వారు గోప్యతను కూడా అభ్యర్థించారు. వారి వివాహ బంధం ముగిసినప్పటికీ ఈషా -భరత్ ఇద్దరూ పరస్పరం గౌర‌వించుకున్నారు. వారి పిల్లల శ్రేయస్సుపై దృష్టి పెట్టారు.

2. ఇషా కొప్పికర్ - టిమ్మీ నారంగ్


ఇషా కొప్పికర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నాగార్జున `చంద్ర‌లేఖ‌` చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌తో పాటు క‌లిసి న‌టించింది. చాలా హిందీ చిత్రాల్లోను న‌టించింది. ఇషా కొప్పిక‌ర్ - వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ 2024 ప్రారంభంలో విడిపోతున్నట్లు ప్రకటించారు. దశాబ్దానికి పైగా సాగిన వారి సంసార జీవ‌నానికి వివాహ బంధానికి ముగింపు పలికారు. 2009లో వివాహం చేసుకున్న ఈ జంట, వారి కుమార్తె రియానాకు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. కుమార్తె కోసం ఆ ఇరువురూ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ జంట‌ విడిపోవడానికి కారణాలను వారు బహిరంగంగా వెల్లడించనప్పటికీ ఈ జంటకు సన్నిహిత వర్గాలు సరిదిద్దలేని విభేదాలను ప్రాథమిక కారణంగా పేర్కొన్నాయి.

టిమ్మీ ఒక ఇంటర్వ్యూలో అస‌లు విష‌యం చెప్పారు. దాదాపు ఏడాదిన్నర పాటు విడాకుల గురించి ఆలోచించిన తర్వాత మేము దాని కోసం దాఖలు చేసాము. గత ఏడాది నవంబర్‌లో విడాకులు మంజూరు చేయగా అది సామరస్యపూర్వకంగానే జరిగింది. మా ఇద్దరికీ ఇప్పుడు మా జీవితాలను కొనసాగించడానికి స్వేచ్ఛ ఉంది.. ఇది వాస్తవం.. అని అన్నారు.

3. దల్జీత్ కౌర్ - నిఖిల్ పటేల్


టెలివిజన్ నటి దల్‌జీత్ కౌర్ .. ఆమె భర్త నిఖిల్ పటేల్ కూడా 2024లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పాపుల‌ర్ టీవీ షోలలో తన పాత్రలతో పేరుగాంచిన డల్‌జీత్, కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అయిన నిఖిల్‌ను ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో ఈ జంట బాగా ప్రచారంలోకి వచ్చింది.

నిఖిల్ వివాహేతర సంబంధంలో ఉన్నాడని డల్‌జీట్ బహిరంగంగా ఆరోపించింది. డ‌ల్ జీట్ తన కుమారుడు జైడన్‌తో కలిసి కెన్యాను విడిచిపెట్టి భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఇది చివరికి వారి బ్రేక‌ప్ కి దారితీసింది.

4. అర్జున్ కపూర్ - మలైకా అరోరా


2024లో బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్ - మలైకా అరోరా విడిపోవడమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట, వారి బహిరంగ ప్రదర్శనలు, ఆకర్షణీయమైన ప్రదర్శనల గురించి తరచుగా మీడియాలో హెడ్ లైన్స్ వ‌చ్చాయి. అయితే 2024 మేలో వారి బంధం వీగిపోయింద‌ని పుకార్లు చుట్టుముట్టాయి. అర్జున్ పుట్టినరోజు వేడుకలో మలైకా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. పుకార్లపై ఇద్దరూ గౌరవప్రదంగా మౌనం వహించినప్పటికీ వారి ఇటీవలి రహస్య పోస్ట్‌లు అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాయి. అర్జున్ పుట్టినరోజు వేడుకలకు మలైకా గైర్హాజరు కావడం ఈ జంట‌ విడిపోవడాన్ని ధృవీకరించాయి.

5. హార్దిక్ పాండ్యా- నటాసా స్టాంకోవిచ్


క్రికెటర్ హార్దిక్ పాండ్యా- న‌టి కం మోడల్ నటాసా స్టాంకోవిచ్ కూడా 2024లో తమ అనుబంధాన్ని ముగించారు. 1 జనవరి 2020న నిశ్చితార్థం చేసుకుని, తర్వాత వివాహం చేసుకున్న వీరిద్దరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.

వారు విడిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ కుమారుడికి సహ-తల్లిదండ్రులుగా కొన‌సాగుతామ‌ని గోప్య‌త‌ను గౌర‌వించాల‌ని అన్నారు. నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి హార్దిక్ ఇంటిపేరును తొలగించినప్పుడు అది విడాకుల పుకార్లకు దారితీసింది. చివ‌రికి బ్రేక‌ప్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Relationship 
  • Marriage 
  • Love 
  • Divorce 
  • Breakup 
  • EshaDeol 
  • BharatTakhtani 
  • TimmyNarang 
  • IshaKoppikar 
  • DaljitKaur 
  • NikhilPatel 
  • ArjunKapoor 
  • MalaikaArora 
  • HardikPandya 
  • NatasaStankovic 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS