భార్య‌ల కార‌ణంగా ఆందోళ‌న‌లో ఆ ఇద్ద‌రు హీరోలు

ఇంత‌కుముందే అమెజాన్ ప్రైమ్ వీడియో మ‌తి చెడే ప్రకటన విడుద‌ల‌ చేసింది. అందాల క‌థానాయిక‌లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా `ట్వూ మచ్` అనే టాక్ షోని నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.;

Update: 2025-07-22 17:34 GMT

సెల‌బ్రిటీ టాక్ షోలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే పాపుల‌ర‌వ‌తున్నాయి. అయితే అన్ని టాక్ షోలు `కాఫీ విత్ క‌ర‌ణ్` కాలేక‌పోవ‌డానికి కాణం? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇంకా పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఇండ‌స్ట్రీ స్టార్ హీరోల భార్య‌లు చేస్తున్న ట్వూమ‌చ్ షో కార‌ణంగా ఇక క‌రణ్ జోహార్ మూటా ముళ్లు స‌ర్ధుకుని ఇంటికి పోవాల్సిందేన‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంత‌కుముందే అమెజాన్ ప్రైమ్ వీడియో మ‌తి చెడే ప్రకటన విడుద‌ల‌ చేసింది. అందాల క‌థానాయిక‌లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్టులుగా `ట్వూ మచ్` అనే టాక్ షోని నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ భామ‌ల హాస్యం, కామిక్ టైమింగ్, సెటైర్ ఇవ‌న్నీ ఈ షోకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కాబోతున్నాయి. ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీల గుట్టు మ‌ట్ల‌ను లీక్ చేయించేందుకు ఈ ఇద్ద‌రి ఇంటెలిజెన్స్ స‌రిపోతుందా లేదా? క‌ర‌ణ్ జోహార్ త‌ర‌హాలో స్పాంటేనియ‌స్ గా మాట్లాడేస్తూ ఎదుటి వారి నుంచి గుట్టు లాక్కునే తెలివితేట‌లు ఉన్నాయా లేవా? అన్న‌ది కూడా క‌థ‌ను న‌డిపిస్తుంది. ఆస‌క్తిక‌రంగా కాజోల్ భ‌ర్త అజ‌య్ దేవ‌గ‌న్, ట్వింకిల్ భ‌ర్త అక్ష‌య్ కుమార్ గుట్టు కూడా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అభిమానులు సందేహిస్తున్నారు. అయితే ఈ షో కాఫీ విత్ క‌ర‌ణ్ 2.0 కావాల‌ని కొంద‌రు కోరుకుంటున్నారు.

ఇక ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాల స‌తీమ‌ణులు నిర్వ‌హించే షోకి టాప్ సెల‌బ్రిటీలంతా అటెండ‌య్యేందుకు ఆస్కారం ఉంది. అయితే చ‌క్క‌న‌మ్మ‌లు త‌మ సొగ‌సును ఆవిష్క‌రించ‌డంలోనే కాదు.. స్పాంటేనియ‌స్ గా ఎదుటివారితో మాట్టాడిస్తూ, గుట్టుమ‌ట్ల‌ను కూడా లాక్కోవాల్సి ఉంటుంది. స‌ర‌దాగా మాట్లాడేస్తూనే టాప్ సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టేలా చేయగ‌లగాలి.


Tags:    

Similar News