• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోటీపై బాలయ్య అలా.....

పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా!

| వివరాళ్లోకి వెళితే... లియో సినిమా గురించి కాస్త పక్కనపెడితే.. టాలీవుడ్​లో భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది

By - Tupaki Desk
Update: 2023-10-16 07:57 GMT

ఈ దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. మరో మూడు నాలుగు రోజుల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఈ పోటీపై బాలయ్య - రవితేజ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాస్​ మాహారాజ్ ఒకలా మాట్లాడితే.. నటసింహం మరోలా మాట్లాడటం ప్రస్తుతం కాస్త చర్చనీయాశంమైంది.

వివరాళ్లోకి వెళితే... లియో సినిమా గురించి కాస్త పక్కనపెడితే.. టాలీవుడ్​లో భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒక్కరోజు గ్యాప్​లో రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఇరు చిత్రబృందాలు ప్రమోషన్స్​ జోరుగా చేస్తున్నాయి. వరుస అప్డేట్స్​, ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.

తాజాగా టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్​ జరుపుకుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అలాగే ఇతర కొన్ని విషయాలను గురించి రవితేజ మాట్లాడారు. తన సినిమాతో పాటు విడుదలవుతున్న ఇతర సినిమాలకు ఆల్​ ది బెస్ట్ చెప్పారు. "నా బ్రదర్ లాంటి డైరెక్టర్​ అనిల్ రావిపూడి సినిమా, మా బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరి కూడా రిలీజ్​ అవుతోంది. రెండు సినిమాలు సూపర్​ హిట్​ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో విజయ్ లియో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు.

అంతకుముందు బాలయ్య పోటీ గురించి ప్రెస్​ మీట్​లో మాట్లాడుతూ.. "ఛాలెంజ్​ పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. అయినా మాకు మేమే పోటీ. నాకు ఎవరూ పోటీ లేరు. ఎవరినీ పట్టించుకోను. నా సినిమాలు నాకే పోటీ." అని చెప్పారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మాట్లాడిన కామెంట్స్ వైరల్​గా మారాయి.

రవితేజ మాట్లాడిన కామెంట్స్​ పాజిటివ్​ వైబ్​లో ఉన్నప్పటికీ.. బాలయ్య కామెంట్స్​ కొంతమందికి కాస్త గట్టిగా అనిపించాయి! కానీ ఆయన సందర్భానికి తగ్గట్టుగా పాజిటివ్​ వేలోనే మాట్లాడారని, తన సినిమా తనకే పోటీ అనే అన్నారు కానీ, ఎవరినీ కించపరచలేదని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో వీరిద్దరు అన్​స్టాపబుల్​లో కలిసి ఎంత సరదాగా మాట్లాడుకున్నారో తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. కాబట్టి బాలయ్య కామెంట్స్​లో తప్పు బట్టడానికి ఎలాంటి ఆస్కారం లేదనే చెప్పాలి.

Maa Balayya Babu Cinema and Vijay cinema Block Busters Avvali Ani Korukuntunna - @RaviTeja_offl #TigerNageswarao #Leo #Vijay #BagavathKesari #RaviTeja #BalaKrishna pic.twitter.com/gBqXZNTA8w

— Srinivas (@srinivasrtfan2) October 15, 2023

#NandamuriBalakrishna : "మాకు మేమే పోటీ. నాకెవరూ పోటీ లేరు నేనేవ్వడని పట్టించుకోను"

I compete only with myself! Don't care about others!! pic.twitter.com/nhWcq5qMts

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 15, 2023
Tags:    
  • Bhagavanthkesari 
  • Tigernageswararao 
  • Balakrishna 
  • Raviteja 
  • Leomovie 
  • Vijaythalapathy 
  • Vamsee 
  • Anilravipudi 
  • Lokeshkanagaraj 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS