• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి బాక్సాఫీస్​.. ఆ...

సంక్రాంతి బాక్సాఫీస్​.. ఆ ఒక్క చిత్రానికే థియేటర్లు డౌట్​!

| వచ్చే సంక్రాంతి 2024 బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా సాగనుందన్న సంగతి తెలిసిందే. ఏకంగా అరడజను సినిమాలు బరిలోకి దిగుతున్నాయి

By - Tupaki Desk
Update: 2023-10-20 10:57 GMT

వచ్చే సంక్రాంతి 2024 బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా సాగనుందన్న సంగతి తెలిసిందే. ఏకంగా అరడజను సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. పైగా అందులో దాదాపు ఐదు చిత్రాలు స్టార్ హీరోలవే కావడం విశేషం. దీంతో ఈ చిత్రాలన్నింటికీ థియేటర్లను ఎలా సర్దుబాటు చేస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా వీటిలో ఓ చిత్రం థియేటర్ల సమస్యను ఎక్కువగా ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.

మహేశ్​ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ వచ్చే ముగ్గుల పండక్కు బెర్త్​లను ఖరారు చేసుకోగా.. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం కూడా ఈ పతాకాల పండక్కే విడుదల తేదీని కన్ఫామ్ చేసుకున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ చిత్రాల్లో మహేశ్​ గుంటూరు కారం అన్నింటికన్నా పెద్ద సినిమా. అలానే బాగా బజ్​ ఉన్న చిత్రం కూడా. ఆ తర్వాత సైంధవ్, ఫ్యామిలీ స్టార్​ చిత్రాలు కూడా మంచి అడ్వాంటేజ్​, హైప్​ ఉన్న చిత్రాలే. వీటికి సురేశ్​ బాబు, దిల్ రాజు నిర్మాతలు కావడం వల్ల.. థియేటర్ల సమస్య పెద్దగా ఉండదు.

ఇక రవితేజ ఈగల్​ మొదట్లో సంక్రాంతికి రానున్నట్లు స్పష్టత ఇచ్చినప్పటికీ.. మరోసారి ఏమీ క్లారటీ ఇవ్వలేదు. దీనిపై కాస్త డౌట్​గా ఉంది. ఒకవేళ ఇది పండగ బరిలో దిగినట్టైతే.. ఇక కొత్త చిత్రాలేమీ సంక్రాంతి బెర్త్​ను ఖరారు చేసుకోవడానికి అవకాశం ఉండదు. నాగార్జున నా సామి రంగ చిత్రం.. పండక్కి రావాలా వద్దా అనేది దాని షూటింగ్​పై ఆధారపడి ఉంటుంది. అయినా నాగ్​కు ఈ పండగ సెంటిమెంట్​ కాబట్టి.. దాదాపుగా అప్పుడే వచ్చి పైసా వసూల్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.

ఫైనల్​గా మిగిలింది 'హనుమాన్' చిత్రం. మరి స్టార్ హీరోల విపరీతమైన పోటీ మధ్య ఈ సినిమా థియేటర్లను పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. స్క్రీన్లను దక్కించుకోవడమంటే పెద్ద సవాల్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ఏమైనా మార్చుకుంటుందా లేదా అనేది..

Tags:    
  • Gunturkaaram 
  • Maheshbabu 
  • Eaglemovie 
  • Raviteja 
  • Naasaamiranga 
  • Nagarjuna 
  • Hanumanmovie 
  • Tejasajja 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS