ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..?

దిల్ రాజు నిర్మించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఊహించని విధంగా ఫలితాన్ని అందుకున్నాడు పరశురాం. అతను చేసిన సినిమాల్లో ఇదే లీస్ట్ అనిపించుకునేలా చేశాడు.

Update: 2024-04-28 05:50 GMT

సినీ పరిశ్రమలో హిట్ పడితే హీరో, హీరోయిన్స్ తో పాటుగా డైరెక్టర్ కు అదే రేంజ్ క్రెడిట్ వస్తుంది. డైరెక్టర్ మార్క్ చూపించగలిగితే చాలు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కథ ఏంటి కాంబినేషన్ ఏంటని కూడా ఆలోచించరు. జస్ట్ డైరెక్టర్ మీద నమ్మకంతో సినిమా చూసేస్తారు. హిట్ పడితే ఎంతగా ఎంకరేజ్ చేసి పొగుడుతారో ఒకవేళ అనుకున్న అంచనాలను అందుకోలేకపోతే అదే రేంజ్ లో విమర్శలు చేస్తారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిభ గల దర్శకులు ఎంతోమంది ఉండగా వారిలో ఒకరిగా ఉంటూ వస్తున్న పరశురాం ప్రస్తుతం ఫ్లాప్ తో కెరీర్ డైలమాలో పడేసుకున్నాడు.

 

దిల్ రాజు నిర్మించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఊహించని విధంగా ఫలితాన్ని అందుకున్నాడు పరశురాం. అతను చేసిన సినిమాల్లో ఇదే లీస్ట్ అనిపించుకునేలా చేశాడు. విజయ్ తో గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరశురామ్ ఆ హిట్ కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాడు పరశురాం.

అసలు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా ఛాన్స్ అందుకున్న పరశురామ్ ఆ సినిమా తర్వాత తన రేంజ్ పెంచుకుంటాడని అనుకుంటే అది జరగలేదు. సర్కారు వారి పాట ఏదో మహేష్ మేనియాతో సోసోగా నడిచేసింది. మహేష్ ని డైరెక్ట్ చేశాక మరో స్టార్ తో సినిమా చేస్తాడని అనుకున్న పరశురాం విజయ్ తో ఫ్యామిలీ స్టార్ అంటూ వచ్చాడు. సినిమా సమ్మర్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.

సినిమా హిట్ అయితే అందులో నటించిన నటీనటులు, మ్యూజిక్ ఆఖరికి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా మాట్లాడుకుంటారు కానీ సినిమా ఫ్లాప్ అయితే అది కేవలం దర్శకుడి పొరపాటే అని టార్గెట్ చేస్తుంటారు. థియేట్రికల్ లో నిరాశరచిన ది ఫ్యామిలీ స్టార్ రీసెంట్ గా ఓటీటీ లో రిలీజైంది. సినిమా చూసిన వారంతా డైరెక్టర్ ని ఎటాక్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరు చేయరు. కానీ అదలా జరిగిపోతుంది. గీతా గోవిందం లాంటి హిట్ పడాలని ప్రయత్నించిన ఈ కాంబో ఆడియన్స్ కు రుచించలేని సినిమా అందించారు. మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీశాకే పరశురాం కి ఏ హీరో ఛాన్స్ ఇవ్వట్లేదని చాలా టైం వెయిట్ చేశాడు మరి ఫ్యామిలీ స్టార్ తర్వాత ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో కొన్నాళ్లు వెయిట్ చేస్తే తెలుస్తుంది.

Tags:    

Similar News