కెప్టెన్ కుర్చీ ఎక్కిన నయా స్టార్స్!
టాలీవుడ్‌లో యువ హీరోలు ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. నటనకే పరిమితం కాకుండా, తెర వెనుక సృజనాత్మకతను చాటేందుకు సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్‌లో యువ హీరోలు ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. నటనకే పరిమితం కాకుండా, తెర వెనుక సృజనాత్మకతను చాటేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం, రామ్ పోతినేని, కార్తికేయ, సుధీర్ బాబు వంటి నయా స్టార్లు దర్శకులుగా మారుతూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. యువ హీరోలంతా డిఫరెంట్ జానర్లను ఎంచుకుంటూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి. తనదైన మిడిల్ క్లాస్ కథలతో ప్రేక్షకులకు చేరువైన ఆయన ఇప్పుడు `రియాలిటీ` అనే చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమా పూర్తిగా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ , వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. నటుడిగా మంచి విజయాలు అందుకున్న కిరణ్ కెప్టెన్ కుర్చీ కి ఎంత వరకూ న్యాయం చేస్తారు? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా దర్శకత్వం వైపు అడుగులు వేయడం విశేషం. 1940ల నాటి కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఓ క్రైమ్ సస్పెన్స్, నియో నాయిర్ జానర్ చిత్రాన్ని స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగంగా నిలవనుంది. కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకునే రామ్ తొలిసారిగా దర్శకుడిగా మారి ఎలాంటి విజువల్ వండర్ సృష్టిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
యువ నటుడు కార్తికేయ కూడా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ కంబ్యాక్ ఇస్తున్నారు. కండలు తిరిగిన దేహంతో, ఇంటెన్స్ బాక్సింగ్ రింగ్ డ్రామాతో సాగే ఈ సినిమా కార్తికేయ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు కూడా దర్శకుడిగా మారుతున్నట్లు ప్రకటించి నూతనోత్సాహం నింపింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ మూవీతో ఆయన కెప్టెన్ ఛైర్ ఎక్కుతున్నారు. సుధీర్‌కు మార్షల్ ఆర్ట్స్ - డ్యాన్స్‌లో ఉన్న ప్రావీణ్యం సినిమాకు ప్రధాన బలంగా మారనుంది. తెరపై తనదైన ఫైట్స్ తో అదరగొట్టే సుధీర్ పూర్తి బాధ్యతలను భుజాన వేసుకుని చిత్రాన్ని ఎలా మలుస్తారు? అన్నది ఆసక్తికరం.
మొత్తానికి నటుల నుంచి దర్శకులుగా మారుతున్న నయా స్టార్స్ ట్రెండ్ పరిశ్రమలో కొత్త ఊపును తెస్తోంది. హీరోల గానే కాకుండా వెండితెరపై విభిన్న కథలను ఆవిష్కరించాలనే తపన అభినందనీయం. నలుగురు యంగ్ హీరోలు డైరెక్షనల్ డెబ్యూస్‌తో ఎలాంటి బాక్సాఫీస్ మ్యాజిక్ చేస్తారు? ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తారనేది చూడాలి.