వాటర్ యాక్షన్ సీన్స్.. అప్ కమింగ్ మూవీల్లో అవే హైలెట్!

ఇప్పుడు అప్ కమింగ్ భారీ చిత్రాల్లో అలాంటి సీన్సే మేకర్స్ యాడ్ చేస్తున్నారు. ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.;

Update: 2025-05-09 14:30 GMT

సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు మేకర్స్ వినూత్నమైన యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం పెద్ద మొత్తంలో బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడడం లేదు. అలా ఇప్పటికే అనేక సినిమాల్లో వివిధ రకాల యాక్షన్ సీన్స్ ను మనం చూసే ఉంటాం.

అయితే వాటిలో వాటర్ యాక్షన్ సీన్స్ చాలా కాస్ట్లీ అనే చెప్పాలి. అవి క్లిక్ అయితే చాలు.. సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పిస్తాయి. రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పిస్తాయి. ఇప్పుడు అప్ కమింగ్ భారీ చిత్రాల్లో అలాంటి సీన్సే మేకర్స్ యాడ్ చేస్తున్నారు. ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో బురద నీటిలో ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. మూవీకి అదే మెయిన్ హైలెట్ గా నిలవనుందని సమాచారం. జూలై లేదా ఆగస్టులో మూవీ విడుదల అవ్వనుందట. మరోవైపు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మూవీలో అదిరిపోయే నీటి పోరాట సన్నివేశం ఉంటుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో భారీ వాటర్ యాక్షన్ సీన్ ఉందని సమాచారం. రీసెంట్ గా హైదరాబాద్ లో వేసిన సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న దేవర 2లో క్రేజీ నీటి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఆ సీన్స్ ను.. ఫస్ట్ పార్ట్ కు మించిన రీతిలో చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక.. ఎన్టీఆర్ దేవర 2ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనంగా మారిన హీరో తేజ సజ్జా నటిస్తున్న మూవీ మిరాయ్ లో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం. సూపర్ హీరో జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 1న వరల్డ్ వైడ్ గా మూవీ విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఆయా చిత్రాల్లోని వాటర్ సీన్స్ ఎలా మెప్పిస్తాయో చూడాలి.

Tags:    

Similar News