ఈ స‌మ్మ‌ర్‌ను కూడా వేస్ట్ చేశారుగా

టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల స‌మ‌స్య బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా స్థాయి విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ప్ర‌తీ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సి వ‌స్తుంది.;

Update: 2025-06-05 10:30 GMT

టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల స‌మ‌స్య బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమా స్థాయి విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ప్ర‌తీ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో మేకింగ్ కు చాలా టైమ్ ప‌డుతుంది. ఫ‌లితంగా సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు. ఆల్రెడీ లాక్ చేసుకున్న డేట్ కు ఆ సినిమాలు రాక‌పోవ‌డంతో మంచి డేట్ ను మిస్ అవ‌డంతో పాటూ ఆ సీజ‌న్ ను డ్రై సీజ‌న్ గా మార్చేస్తున్నారు.

గ‌త మూడేళ్లుగా టాలీవుడ్ స‌మ్మ‌ర్ ను ఏ సినిమా వాడుకోలేక‌పోతుంది. 2025 స‌మ్మ‌ర్ ను కూడా టాలీవుడ్ వేస్ట్ చేసుకుంది. ఈ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ లో శ్రీవిష్ణు సింగిల్ త‌ప్ప మిగిలిన ఏ సినిమా పెద్ద‌గా ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేయ‌లేక‌పోయింది. స‌మ్మ‌ర్ రిలీజ్ కోసం ఎన్నో మీడియం బ‌డ్జెట్ సినిమాలు ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ రేసులో పెద్ద సినిమాలు ఉండ‌టంతో పోటీ ఎందుక‌ని సైలెంటయ్యారు. కానీ ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాలు వాయిదా ప‌డ్డాయి.

స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌నుకుని చేయ‌లేక‌పోయిన మూడు పెద్ద సినిమాల్లో మొద‌టిగా చిరంజీవి విశ్వంభ‌ర ఉంటుంది. వాస్త‌వానికి ఈ సోషియో ఫాంట‌సీ సినిమా 2025 సంక్రాంతికే రిలీజ‌వాల్సింది కానీ గేమ్ ఛేంజ‌ర్ అప్ప‌టికే లేట‌వ‌డంతో ఆ సినిమా సంక్రాంతికి వ‌స్తుంద‌ని విశ్వంభ‌ర‌ను వాయిదా వేసి మే 9న రిలీజ్ చేస్తామ‌న్నారు. దీంతో మే 9న రిలీజ‌వాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ వీఎఫ్ఎక్స్ కార‌ణంగా విశ్వంభ‌ర మే 9న కూడా రిలీజ్ కాలేదు.

విశ్వంభ‌ర సినిమా మే 9న రావ‌డం లేద‌ని తెలిసి, ఆ డేట్ లో ఎంతో కాలంగా ప్రొడ‌క్ష‌న్ లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లును రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోర్ష‌న్ షూటింగ్ పెండింగ్ లో ఉండ‌టం వ‌ల్ల మే 9న వీర‌మ‌ల్లు రాలేదు. రీసెంట్ గానే ప‌వ‌న్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయ‌గా, వీర‌మ‌ల్లు జులై లో రిలీజ్ కానుంది. మే 9న వీర‌మ‌ల్లు రిలీజ‌వుతుంద‌నే కార‌ణంతో కూడా చాలా సినిమాలు త‌మ సినిమా రిలీజుల‌ను వాయిదా వేసుకున్నారు.

ఈ రెండింటితో పాటూ విజ‌య్ దేవ‌ర‌కొండ- గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న కింగ్‌డ‌మ్ సినిమా కూడా మే 31న రిలీజ్ కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ఆలస్యం అవ‌డంతో కింగ్‌డ‌మ్ సినిమా కూడా వాయిదా ప‌డింది. ఇప్పుడు ఈ సినిమా జులై 4న రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. దీంతో కింగ్‌డ‌మ్ కూడా స‌మ్మ‌ర్ లో రిలీజ‌వ‌లేదు. మొత్తానికి ఈ మూడు సినిమాల వాయిదాల వ‌ల్ల టాలీవుడ్ స‌మ్మ‌ర్ చాలా డ్రై గా మారింద‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News