టాలీవుడ్ లో సమ్మె.. ఆ బడా సినిమాలపై ఎఫెక్ట్ తప్పదా?

టాలీవుడ్ లో ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. 30 శాతం వేతనం పెంపుపై స్పందన లేదని ఫిలిం ఫెడరేషన్ బంద్ కు ఇటీవల పిలుపునిచ్చింది;

Update: 2025-08-04 14:48 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. 30 శాతం వేతనం పెంపుపై స్పందన లేదని ఫిలిం ఫెడరేషన్ బంద్ కు ఇటీవల పిలుపునిచ్చింది. ఇవాళ్టి నుంచి షూటింగ్స్ కు వెళ్లొద్దని ప్రకటన జారీ చేసింది. అనుకున్నట్లు వేతనం ఇస్తే షూటింగ్స్ కు వెళ్లాలని ఆదేశించింది. దీంతో కార్మికులు ఈరోజు నుంచి వెళ్లడం లేదు.

అదే సమయంలో చెన్నై, ముంబై నుంచి కార్మికులను రప్పించుకుని షూటింగ్స్ ను టాలీవుడ్ మేకర్స్ కొనసాగిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా.. అందులో నిజమెంతో మాత్రం తెలియదు. కానీ వివిధ సినిమాలతోపాటు వెబ్ సిరీస్ ల షూటింగ్స్ నిలిచిపోవడం మాత్రం నిజమే. అందుకే సమ్మె కొనసాగితే కొన్ని సినిమాలకు మాత్రం తప్పవ్.

ముఖ్యంగా టాలీవుడ్ లో వివిధ బడా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవడంతో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు సమ్మె కొనసాగడం వల్ల క్యాస్టింగ్ కాల్షీట్లు వృథా అవుతాయి. బడ్జెట్ పెరిగిపోతుంది. అద్దెలు పెరిగిపోతాయి. రిలీజ్ డేట్స్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది.

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ సెట్స్ లో షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ కీలక దశలో ఉంది. ఇప్పుడు షూటింగ్ కు బ్రేక్ పడితే.. అనుకున్న ప్లాన్ చేంజ్ అవుతుంది. సినిమాలో యాక్ట్ చేస్తున్న నటీనటుల కాల్షీట్స్ కూడా వేస్ట్ అవుతాయి.

అదే సమయంలో టాలీవుడ్ నటసింహం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ-2 తాండవం మూవీ షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. మరికొన్ని రోజుల షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. దసరా కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ తెలిపారు. కానీ ఇప్పుడు షూటింగ్ కు బ్రేక్ పడితే మేకర్స్ కు ఇబ్బందే.

మరోవైపు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న రాజా సాబ్ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. రీసెంట్ గా భారీ సెట్ లో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు కావాలి. ఇప్పుడు బంద్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదే కంటిన్యూ అయిే రాజా సాబ్ మేకర్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆంధ్రాకింగ్ తాలూకా, సంబరాల ఏటిగట్టు, తెలుసు కదా, డెకాయిట్ వంటి మరిన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. దీంతో మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు నిర్మాతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో.. సమ్మె విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News