రూటు మార్చిన టాలీవుడ్‌ బిగ్‌స్టార్స్‌

ఒకప్పుడు సెలబ్రెటీలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చారు.;

Update: 2025-04-22 05:46 GMT

సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఎక్కువగా హాలీడే ట్రిప్స్‌కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హీరోలు షూటింగ్‌ సమయంలో చాలా బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీతో సమయం గడిపేందుకు వారికి కుదరదు. అందుకే వారు షూటింగ్‌ లేనప్పుడు, ఏదైనా ప్రత్యేక రోజు సందర్భంగా హాలీడే ట్రిప్‌కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. హీరోలు వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో వెళ్లడంతో పాటు దర్శకులు సైతం ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్లడం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు సెలబ్రెటీలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చారు. వారి కొత్త హాలీడే స్పాట్‌ దుబాయ్‌గా మారింది.

ఈమధ్య కాలంలో స్టార్స్ మొదలుకుని చిన్న తెర సెలబ్రిటీల వరకు అంతా దుబాయి వెళ్లి అక్కడ ఎంజాయ్‌ చేసి వస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్స్ కొందరు ఏకంగా అక్కడ భారీ మొత్తం ఖర్చు చేసి ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తోంది. దుబాయ్‌ వెళ్లడానికి తక్కువ సమయం పడుతుంది, అంతే కాకుండా విమాన ప్రయాణ ఖర్చు కూడా అమెరికాతో పోల్చితే తక్కువ అవుతుంది. అందుకే సెలబ్రిటీలు దుబాయ్‌కి వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్‌ చేయాలని, హాలీడేస్‌ను అక్కడ గడపాలని అనుకుంటున్నారు. అందుకే దుబాయ్‌ ఈమధ్య కాలంలో టూరిజంలో దూసుకు పోతుంది. అల్లు అర్జున్‌తో పాటు మరికొందరు టాలీవుడ్‌ స్టార్స్, ఇండియన్‌ స్టార్స్‌ దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి.

పలువురు హీరోలు షూటింగ్‌ కి ముందు వారం లేదా అంతకు మించి ఎక్కువ రోజులు దుబాయ్‌లో చిల్‌ అవుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమా షూటింగ్‌లో జాయిన్ కావడం కోసం ఎన్టీఆర్ ముందు దుబాయ్‌ వెళ్లి చిల్‌ అయిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ సైతం ఈ మధ్య కాలంలో దుబాయ్‌ ఎక్కువ సార్లు వెళ్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే దుబాయ్ అభివృద్దిలో దూసుకు పోతుంది. షాపింగ్‌ కోసం కూడా దుబాయ్‌ వెళ్తున్న టాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో అన్ని అంతర్జాతీయ మోడల్స్ ఔట్‌ ఫిట్స్ లభించడంతో పాటు, అక్కడ సరసమైన రేట్లకు లభిస్తాయని సమాచారం.

ఇండియాలో ఉంటే స్వేచ్ఛగా ఉండలేని సెలబ్రెటీలు దుబాయ్ వెళ్లి కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. అందుకే అమెరికాతో పోల్చితే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది దుబాయ్ వెళ్తున్నారు. అమెరికాలో రేట్లతో పోల్చితే దుబాయ్‌ రేట్లు తక్కువ ఉంటాయని అంటున్నారు. మొత్తానికి అన్ని విధాలుగా టాలీవుడ్‌ సెలబ్రెటీలకు దుబాయ్ అనేది అనుకూలంగా ఉంది. అందుకే అమెరికా, బ్రిటన్‌, మాల్దీవ్స్‌ వంటి దేశాలకు వెళ్లకుండా ఇలా దుబాయ్ వెళ్తున్నారు. దుబాయ్‌ వెళ్లి కథ చర్చలు జరపడం మొదలుకని, షూటింగ్స్‌ను సైతం అక్కడ సునాయాసంగా చేసుకునేందుకు వీలు ఉండటంతో అక్కడ షెడ్యూల్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News