ఈ రీరిలీజ్‌ను సెలబ్రేట్ చేయాల్సిందే!
మాయా బజార్ రిలీజై ఆల్మోస్ట్ 70 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆ సినిమా ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫ్రెష్ గా అనిపిస్తుంది.;
టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా తెలుగులోని పాత సినిమాలను రీరిలీజ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ గత మూడేళ్లుగా ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా ప్రతీ సినిమానీ రీరిలీజ్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని సినిమాల రీరిలీజులకైతే ఎర్లీ మార్నింగ్ షోలు కూడా వేశారు.
మరికొన్ని సినిమాలకు థియేటర్ దగ్గర హోర్డింగులు, థియేటర్ లోపల ఫ్యాన్స్ సందడి, ఆ తర్వాత సినిమా ఓపెనింగ్స్, ఫైనల్ కలెక్షన్ల రికార్డులు ఇలా రీరిలీజుల పరంగా ఎన్నో విషయాల్లో డిస్కషన్స్ జరగడం చూశాం. టీవీలో ఎన్నోసార్లు చూసిన సినిమాలను కూడా మళ్లీ థియేటర్లకు వెళ్లి చూడటమే కాకుండా ఆ రీరిలీజుని సెలబ్రేట్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు తెలుగు ఆడియన్స్.
అంతేకాదు రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ ప్రమోషన్స్, హడావిడి అవసరమా అని కూడా కొందరు విమర్శించారు. అయినప్పటికీ ఫ్యాన్స్ అవేమీ పట్టించుకోకుండా తమ తమ హీరోల రీరిలీజులను ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన రీరిలీజ్ ఒకటి రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు మాయాబజార్.
మాయా బజార్ రిలీజై ఆల్మోస్ట్ 70 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆ సినిమా ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని జెనరేషన్స్ మారినా మాయా బజార్ ను మా సినిమా అని తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. ఆ సినిమాలోని నటీనటుల యాక్టింగ్, సినిమాను డైరెక్టర్ మలిచిన విధానం అన్నీ ఎంతో గొప్పగా ఉంటాయి.
ఇప్పటి జెనరేషన్ మాయా బజార్ సినిమాను చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఈ నెలాఖరుకి మాయా బజార్ రీరిలీజ్ ను ప్లాన్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొన్నేళ్ల కిందట కలర్ లోకి మార్చి రీరిలీజ్ చేసి లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేయగా అప్పుడు దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు రీరిలీజుల ట్రెండ్ ఎక్కువైన నేపథ్యంలో మాయాబజార్ ను కూడా కొంచెం భారీగానే ప్లాన్ చేస్తున్నారు.