టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్.. ఆ ప్రొడ్యూసర్ అసలేం చేశారు?
టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు నెలకొన్నాయి! ప్రముఖ పాన్ ఇండియా హీరోకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ నిర్మాత చుట్టూ వివాదం ముదురుతుండటంతో ఇప్పుడు అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.;
టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్ అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు నెలకొన్నాయి! ప్రముఖ పాన్ ఇండియా హీరోకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ నిర్మాత చుట్టూ వివాదం ముదురుతుండటంతో ఇప్పుడు అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీఐడీ అధికారులు ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టడం ఆ వ్యవహారాన్ని ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మార్చింది.
సమాచారం ప్రకారం, ఇటీవల సీఐడీ అధికారులు ఆ నిర్మాత నివాసం, కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటం అనుమానాలకు దారితీస్తోంది. దీంతో ఆయన కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఆ ప్రొడ్యూసర్ ఏం చేశారన్నది డిస్కస్ చేసుకుంటున్నారు.
ఆ నిర్మాత కేసుకు సంబంధించిన వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఆయన పాత్రపై సీఐడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల మళ్లింపు, భూ వ్యవహారాల్లో జోక్యం వంటి ఆరోపణలపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
రాజకీయ పరిచయాలు ఉపయోగించుకుని లబ్ధి పొందారనే కోణంలో కూడా ఆధారాలు సేకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆయన చేసిన కొన్ని పోస్టులు కూడా సమస్యలను మరింత పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తప్పుడు సమాచారాన్ని పంచడం వంటి అంశాలపై కేసులు నమోదయ్యి ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ నిర్మాతకు దగ్గరగా ఉన్న కొంతమంది అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఆయన ప్రస్తుత స్థానం గురించి క్లారిటీ కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. కీలక ఆధారాలు లభిస్తే త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.
ఆ పరిణామాలకు మరో కీలక కారణం.. సదరు నిర్మాతకు ఒక స్టార్ హీరోతో ఉన్న సన్నిహిత సంబంధం. ఆ కారణంగానే ప్రొడ్యూసర్ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అరెస్టు జరిగితే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో ఆ హీరోపై కూడా ఎలాంటి ప్రభావం ఉంటుందా అన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. మొత్తానికి, టాలీవుడ్ లో ఆ వ్యవహారం పెద్ద చర్చగా మారింది. అజ్ఞాతంలో ఉన్న నిర్మాత స్వయంగా లొంగిపోతారా? లేక సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు సినీ ఇండస్ట్రీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుందనే చెప్పాలి.