• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘పెద్ది’కి వదిలేస్తున్న...

‘పెద్ది’కి వదిలేస్తున్న ‘ప్యారడైజ్

| ఈ రోజుల్లో సినిమా మొదలైనపుడే ఘనంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు కానీ.. తీరా చూస్తే ఆ డేట్‌కు సినిమాను రెడీ చేయలేక వాయిదా వేసేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-06-17 06:30 GMT

ఈ రోజుల్లో సినిమా మొదలైనపుడే ఘనంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు కానీ.. తీరా చూస్తే ఆ డేట్‌కు సినిమాను రెడీ చేయలేక వాయిదా వేసేస్తున్నారు. గతంలో ఇలా డేట్ మారిస్తే పెద్ద విషయంలా ఉండేది. దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగానూ భావించేవారు. కానీ కరోనా తర్వాత ఆ ఫీలింగ్ పోయింది. ఒక సినిమాకు పలుమార్లు డేట్ మార్చడం మామూలైపోయింది. సినిమా మొదలైనపుడు చెప్పిన డేట్‌కు వచ్చే వాళ్లు అరుదనే చెప్పాలి. ఐతే ఉన్నంతలో నేచురల్ స్టార్ ఈ విషయంలో కొంచెం పక్కాగా ఉంటాడు. తన చివరి నాలుగు చిత్రాలు హిట్-3, సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా చెప్పిన డేట్‌కే వచ్చాయి. కానీ తన కొత్త సినిమా మాత్రం డేట్ తప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రమే.. ది ప్యారడైజ్.

కొన్ని నెలల కిందటే ప్రి టీజర్‌తో పలకరించింది ‘ది ప్యారడైజ్’. అందులోనే వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’కి సైతం అదే డేట్ ప్రకటించగా.. చరణ్, నాని మధ్య క్లాష్ ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోయారు. ‘హిట్-3’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. తాము అయితే పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నామని.. ఆ డేట్‌కు రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పాడు నాని. తీరా ఆ సమయానికి తమ రెండు చిత్రాల్లో ఏదైనా తప్పుకుంటుందేమో చూడాలి, రెండూ రిలీజైనా పర్వాలేదు అన్నాడు నాని. ఐతే అతను ఆ మాటలు చెప్పే సమయానికి అనుకున్న ప్లానింగ్ ప్రకారం ‘ది ప్యారడైజ్’ మొదలు కావట్లేదు.

ఈపాటికే సెట్స్ మీదికి వెళ్లాల్సిన ‘ది ప్యారడైజ్’ వచ్చే నెలలో కూడా చిత్రీకరణ మొదలుపెట్టుకుంటుందా అన్నది సందేహం అంటున్నారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యమే అందుక్కారణం. ఇంకా స్క్రిప్టుకు కొంత మెరుగులు దిద్దుతుండగా.. ఈ సినిమాకు వేయాల్సిన భారీ సెట్టింగ్స్‌కు కూడా టైం పడుతోందట. షూట్ మొదలు కావడంలోనే ఆలస్యం జరుగుతుండడంతో చెప్పిన డేట్‌కు సినిమాను రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. ఇది నాని కెరీర్లోనే భారీ సినిమా. కాబట్టి ఇంకో ఎనిమిది నెలల్లో రిలీజ్ అంటే కష్టమే. కాబట్టి వేసవి చివరికి వాయిదా పడడం ఖాయమంటున్నారు. మరోవైపు ‘పెద్ది’ సినిమా పక్కా షెడ్యూల్స్ ప్రకారమే చిత్రీకరణ జరుపుకుంటుండడంతో మార్చి చివరి వారంలో ఆ సినిమా రిలీజ్ కావడం ఖాయమని అంటున్నారు.

Tags:    
  • TheParadise 
  • Peddi 
  • RamCharan 
  • Nani 
  • Tollywood 
  • MovieRelease 
  • FilmDelay 
  • TollywoodUpdates 
  • TeluguCinema 
  • MovieBuzz 
  • FilmIndustry 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS