సినిమా తీయడం కాదు కాపాడు కోవడం గొప్ప!
ఈ విషయంలో మాత్రం ఎవరూ రాజీ పడరు. సినిమాకు ఈ రూపంలో పెద్దగా డ్యామేజ్ లేదు. కానీ అసలైన డ్యామేజ్ సరిగ్గా రిలీజ్ కు ముందు...రిలీజ్ అనంతరమే జరుగుతోంది.;
సినిమా తీయడం కాదు.. దాన్ని కాపాడు కోవడం అన్నది గొప్ప. అవును ట్యాలెంట్ ఉన్న సినిమా ఎవరైనా తీస్తారు. కానీ తీసిన కంటెంట్ ని లీక్ అవ్వకుండా కాపాడుకోవడంలో అంతకు మించిన ప్రతిభ చూపిం చాల్సిన సమయమిది. చిత్ర పరిశ్రమలో లీకుల బెడద ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆన్ సెట్స్ అయినా ఆఫ్ ది సెట్ అయినా? లీకులు మాత్రం తప్పడం లేదు. ఇన్ డోర్ అయినా ఔట్ డోర్ అయినా షూటింగ్ ఎక్కడ జరిగినా లీకులు యధేశ్చగా జరుగుతూనే ఉన్నాయి.
ఆ మద్య `పౌజీ` నుంచి ప్రభాస్ వింటేజ్ లుక్ లీక్...అంతకు ముందు ఎస్ ఎస్ ఎంబీ 29 నుంచి మహేష్ లుక్... `రాజాసాబ్` వీడియోలు లీక్ అవ్వడం... చిరంజీవి 157వ కేరళ షెడ్యూల్ లీక్ అవ్వడం...ఇలా ప్రతీది లీక్ అయిన సన్నివేశమే. ఆన్ సెట్స్ లో ఎన్ని కండీషన్స్ ఉన్నా? లీకులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన మెయిన్ క్రూ తప్ప మిగతా ఎవరూ ఫోన్లు తీసుకెళ్లడానికి వీలులేదు. తీసుకెళ్లినా సెక్యూరిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. ప్రధానంగా అన్ని పెద్ద సినిమా యూనిట్లు ఈ నిబందన తప్పక పాటిస్తాయి.
ఈ విషయంలో మాత్రం ఎవరూ రాజీ పడరు. సినిమాకు ఈ రూపంలో పెద్దగా డ్యామేజ్ లేదు. కానీ అసలైన డ్యామేజ్ సరిగ్గా రిలీజ్ కు ముందు...రిలీజ్ అనంతరమే జరుగుతోంది. ఈ రకమైన లీకులతో ఓటీటీలు గగ్గొలు పెడుతున్నాయి. ఈ రెండు సందర్భాల్లో సినిమా పైరసీకి గురవుతుంది. థియేటర్ ప్రింట్ సహా కొన్నిసందర్భాల్లో హెచ్ డీ ప్రింట్ కూడా పైరసీ వెబ్ సైట్లలో దర్శనమిస్తోంది. దీన్ని అరికట్టాలని నిర్మా తలు ఎన్ని చర్యలు తీసుకున్నా? అవి అక్కడికే పరిమితమవుతున్నాయి.
అరికట్టడం మాత్రం సాద్యమవ్వడం లేదు. చాంబర్ లో యాంటీ పైరసీ వింగ్, సైబర్ క్రైమ్ కలిసి పని చేస్తున్నా? పైరసీ మాత్రం యథేశ్చగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు పైరసీని అరికట్టేలే కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే థియేటర్లో పైరసీ కాకుండా కొంత టెక్నాలజీ అందు బాటులో ఉంది. దానికి అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారుట. దీనిలో అగ్ర ఓటీటీ సంస్థలు కూడా భాగమవుతున్నట్లు తెలిసింది.