బ్లాక్ బస్టర్ కావాలా మాస్ అవతార్ వేసేయ్!
ఇది నిన్న మొన్నటి మాట ఇప్పుడు హీరో అంటే డెఫినేషన్ మారిపోయింది. ఎంత రఫ్‌గా ఉంటే అంత క్రేజ్.ఎంత రఫ్ లుక్ ఉంటే అంత పవర్ ఫుల్..;
హీరో అంటే మంచి బాలుడు, సకలగుణాభిరాముడు, ఆరడుగుల అందగాడు.. ఇది నిన్న మొన్నటి మాట ఇప్పుడు హీరో అంటే డెఫినేషన్ మారిపోయింది. ఎంత రఫ్‌గా ఉంటే అంత క్రేజ్.ఎంత రఫ్ లుక్ ఉంటే అంత పవర్ ఫుల్.. హీరో మేకోవర్ విషయంలో అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో మన హీరోలు కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. హిట్‌లని సొంతం చేసుకుంటూ ఫ్యాన్స్‌ని, సినీ లవర్స్‌ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని దక్కించుకోవాలన్నా హీరోలు కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
ఒకప్పుడు హీరో స్టైలిష్‌గా, చొక్కా నలగకుండా కనిపిస్తే ఆహా ఓహో అంటూ ఆడియన్స్ జేజేలు పలికేవారు కానీ ఇప్పుడు హీరో ఎంత రఫ్‌గా, ఎంత రగ్గ్‌డ్ లుక్ మేకోవర్‌లోకి పరకాయ ప్రవేశం చేస్తే అంత బ్లాక్ బస్టర్ హిట్‌లని అందిస్తున్నారు. దీంతో హీరోలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే మాస్ అవతార్ వేయడానికి సిద్ధమైపోతున్నారు. గతంలో ఓ క్యారెక్టర్ చేయాలంటే దర్శకులకు సవాలక్షా షరతులు పెట్టే హీరోలు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఆడియన్స్‌ని ప్రసన్నం చేసుకోవాలంటే మాస్ మంత్రం పఠించాల్సిందేనని డిసైడ్ అవుతున్నారు.
అందంగా కనిపించడానికే ఇష్టపడే హీరోలు ఆ జోన్ నుంచి బయటికొచ్చి రఫ్‌లుక్‌తో మాసీవ్ మేకోవర్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. క్యారెక్టర్ కోసం ఓ సామాన్యుడిలా మారిపోయి డిఫరెంట్ మేకోవర్‌తో ఆశ్చర్యపరుస్తూ బ్లాక్ బస్టర్‌లని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. పుష్ప` సిరీస్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బారు గడ్డం, మీసం, గల్లలుంగీతో కనిపించి పాన్ ఇండియా వైడ్‌గా రచ్చ చేయడం తెలిసిందే. అదే తరహాలో `దేవర` కోసం ఎన్టీఆర్ మాస్ అవతారం ఎత్తారు.
`దసరా` మూవీలో నేచురల్ స్టార్ నాని కూడా మాసీవ్ అవతార్‌లో కనిపించి వంద కోట్ల క్లబ్‌లో చేరడం తెలిసిందే. `రంగస్థలం` కోసం గడ్డంతో కనిపించిన రామ్ చరణ్ ఇప్పుడు `పెద్ది కోసం కూడా అదే తరహా మేకోవర్‌ల కనిపించి అదరగొట్టగానికి రెడీ అవుతున్నారు. ఇటీవల వంద కోట్ల క్లబ్‌లో చేరిన `తండేల్`లో నాగచైతన్య బారు గడ్డంతో కనిపించి ఆకట్టుకోవడం తెలిసిందే. `కింగ్‌డమ్` కోసం విజయ్ దేవరకొండ కూడా ఇదే తరహాలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
`ది ప్యారడైజ్`లోనూ నాని రఫ్‌లుక్‌లో కనిపించ ఆకట్టుకోబోతున్నాడు. ఇప్పుడు వీరితరహాలోనే సబ్లాక్ బస్టర్ హిట్ కోసం అక్కినేని వారి హీరో అఖిల్ అక్కినేని కూడా `లెనిన్` కోసం బారు గడ్డంతో మాసీవ్ అవతార్‌లో కనిపిస్తుండటం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్‌లో అఖిల్ రఫ్ లుక్‌తో కనిపించడంతో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇలా హిట్ కోసం మన హీరోలంతా మాపస్ అవతార్ లోకి ట్రాన్స్‌ఫార్మ అవుతూ అనుకున్న బ్లాక్ బస్టర్లని దక్కించుకుంటూ ఇతర హీరోలకు ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.