తారక్ ఫ్యాన్స్ ని వెంటాడుతోన్న ప్లాప్ సెంటిమెంట్!
ఆ రకంగా చరణ్ కి బాలీవుడ్ నుంచి తొలి సినిమాతోనే ఎదురు దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ బాలీవుడ్ అ టెంప్ట్ చేయలేదు.;
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ కలిసి రాలేదా? లాంచ్ అయిన హీరోలకు అక్కడ వైఫల్యం తప్ప సక్సెస్ ఎదురవ్వలేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `జంజీర్` రీమేక్ తో బాలీవుడ్ కి ఎన్నో ఆశలతో వెళ్లాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అపూర్వ లాఖియా దర్శకత్వం వహించిన చిత్రం తెలుగులో `తుఫాన్` టైటిల్ తో రిలీజ్ అయింది. రెండుచోట్లా ఒకే ఫలితాన్ని సాధించింది.
ఆ రకంగా చరణ్ కి బాలీవుడ్ నుంచి తొలి సినిమాతోనే ఎదురు దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ బాలీవుడ్ అ టెంప్ట్ చేయలేదు. అటుపై యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ `ఛత్రపతి` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసాడు. వి.వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా భారీ హైప్ తో నే రిలీజ్ చేసారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఫలితం ఊహించని విధంగా వచ్చింది. ప్రతిగా విమర్శల పాలవ్వాల్సి వచ్చింది. అలాగే పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న ప్రభాస్ కి కూడా బాలీవుడ్ డెబ్యూ గట్టి షాక్ ఇచ్చింది.
`ఆదిపురుష్` చిత్రంతో హిందీ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఓం రౌత్ మేకింగ్ తో ప్రభాస్ అభాసుపాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ హీరోలు అప్పటి నుంచి బాలీవుడ్ లో మరో ప్రయత్నం చేయ లేదు. అయితే ఇప్పుడీ వైఫల్యాల పరంపర యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. తారక్ `వార్ 2`తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. `వార్` ప్రాంచైజీలో తొలి చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో `వార్ 2`ని టాలీవుడ్ మార్కెట్ కోసం తారక్ ని రంగంలోకి దించి చేసారు. అయితే చరణ్, ప్రభాస్ ల బాలీవుడ్ వైఫల్యంతోనే అభిమానులు ఆలోచనలో పడుతున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుంది? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.