టాలీవుడ్ హీరోల విలనిజం వాళ్ల‌కు క‌లిసొస్తుంది!

తాజాగా కింగ్ నాగార్జున‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లో విల‌న్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.;

Update: 2025-06-18 15:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోల విల‌నిజం ప‌ర భాషా హీరోల‌కు క‌లిసొస్తుందా? అంటే అవున‌నే అనాలి. కోలీవుడ్ కి యువ హీరో కార్తికేయ గుమ్మ‌డి కొండ విల‌న్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిదే. త‌ల అజిత్ హీరోగా న‌టిం చిన 'వ‌లిమై' చిత్రంలో ప్రధాన విల‌న్ గా న‌టించాడు కార్తికేయ‌. టాలీవుడ్ లో హీరోగా ఛాన్సులున్నా? అజిత్ సినిమాలో విల‌న్ రోల్ కావ‌డంతో మ‌రో మాట లేకుండా క‌మిట్ అయ్యాడు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అటుపై కోలీవుడ్ లో విల‌న్ గా కొత్త అవ‌కాశాలు మాత్రం రాలేదు. ఆ సినిమాతోనే కార్తికేయ స‌రిపె ట్టుకోవాల్సి వ‌చ్చింది.

అంత‌కు ముందు రానా ద‌గ్గుబాటి కూడా ఇత‌ర భాష‌ల్లో చాలా సినిమాలు చేసాడు. త‌నని తాను పాన్ ఇండియా న‌టుడిగా ఆవిష్క‌రించుకునే కార్య‌క్ర‌మంలో భాగంగా ఏ భాష‌లో అవ‌కాశం వ‌చ్చినా? ఎలాంటి పాత్ర వ‌చ్చినా చేసాడు. హిందీ, త‌మిళం, క‌న్న‌డం అన్ని భాష‌ల్లోనూ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లు పోషించాడు. పాత్ర ఫ‌రిది కూడా చూడ‌కుండా వ‌చ్చిందే అవ‌కాశంగా ప‌నిచేసాడు. ఆ ర‌కంగా రానా 'బాహుబ‌లి' లో న‌టించక‌ముందే పాన్ ఇండియా న‌టుడుయ్యాడు. ఆ సినిమా విజ‌యాలు రానాకు అక్క‌డ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.

తాజాగా కింగ్ నాగార్జున‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లో విల‌న్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ హీరోగా న‌టిస్తోన్న 'కూలీ' చిత్రంలో నాగార్జున విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సినిమాలో ఈ పాత్ర చాలా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ టేకింగ్ లో ప్ర‌తీ న‌టుడు హైలైట్ అవుతాడు. పైగా నాగ్ ని స్పెష‌ల్ గా సింహంలా న‌డ‌వాలిన ఆదేశించిన నేప‌థ్యంలో ఆ రోల్ ఎలా ఉంటుందో ఊహ‌కే అంద‌డం లేదు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ 2' తో విల‌న్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంత‌కాలం పాత్ర విష‌యంలో క్లారిటీ లోపించినా తార‌క్ పాత్ర నెగిటివ్ రోల్ అని తేలిపోయింది. అలాగ‌ని తార‌క్ రోల్ ఎక్క‌డా త‌గ్గ‌దు. హృతిక్ పాత్ర‌కు ధీటుగా ఉంటుంది. నాగ్-తారక్ ఒకేసారి ఇత‌ర భాష‌ల్లోకి వెళ్ల‌డం విశేషం. నాగ్ ని బాబాయ్ అంటూ తారక్ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు. నాగార్జున కూడా త‌న పెద్ద అబ్బాయ్ అంటూ తార‌క్ పై అంతే అభిమానం చూపిస్తారు. రెండు సినిమాల స‌క్సెస్ ల‌తో ఇద్ద‌రికీ మంచి పేరొస్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News