హిట్ ఇచ్చామ‌ని వెయిట్ చేస్తే టైమ్ వేస్ట్!

మ‌ళ్లీ స్టార్ హీరోల వెంటే ప‌రుగులు పెడ‌తారు. టాలీవుడ్ లో ఈ స‌న్నివేశం క్లియ‌ర్ గా క‌నిపిస్తుంది. ఇలాంటి సీనియ‌ర్ల సూత్రాన్నే పాటిస్తుంటారు కొంత మంది న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు కూడా.;

Update: 2025-09-28 03:15 GMT

స్టార్ డైరెక్ట‌ర్లు అంతా స్టార్ హీరోల‌కే క‌మిట్ అయి ఉంటారు. వాళ్ల‌లో వాళ్లే సినిమాలు చేస్తారు. త‌ప్ప ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఓ మెట్టు దిగడానికి ఎంత మాత్రం అంగీక‌రించ‌రు. అలా చేస్తే త‌న డిమాండ్ ఎక్క‌డ త‌గ్గిపోతుంద‌న‌ని స‌సేమేరా అంటారు. ఇలా ఎంత కాలం అంటే? ఆ స్టార్ డైరెక్ట‌ర్ కి వ‌రుస‌గా ప్లాప్ లు ఎదుర‌య్యే వ‌ర‌కూ. అలా జ‌రిగితే మ‌ళ్లీ అదే స్టార్ హీరో అవ‌కాశం ఇవ్వ‌డు. అప్పుడు ఒక మెట్టు కాదు ప‌ది మెట్లు కింద‌కు దిగి మ‌రీ టైర్ 2 -మిడ్ రేంజ్ హీరోల‌తో సినిమాలు చేస్తారు. దాన్ని వారంతా బౌన్స్ బ్యాక్ గా భావిస్తారు. ఆ హిట్ తో మ‌ళ్లీ క‌థ మొద‌టికే వ‌స్తుంది.

స్టార్ హీరోలే టార్గెట్ గా:

మ‌ళ్లీ స్టార్ హీరోల వెంటే ప‌రుగులు పెడ‌తారు. టాలీవుడ్ లో ఈ స‌న్నివేశం క్లియ‌ర్ గా క‌నిపిస్తుంది. ఇలాంటి సీనియ‌ర్ల సూత్రాన్నే పాటిస్తుంటారు కొంత మంది న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు కూడా. నానా క‌ష్టాలు ప‌డి ఓ సినిమా ఛాన్స్ అందుకుంటారు. ఆ డైరెక్ట‌ర్ ప్ర‌తిభావంతుడైతే హిట్ అందుకుంటాడు. కానీ అదే డైరెక్ట‌ర్ మ‌ళ్లీ అదే హీరోతో సినిమా తీయాలంటే ఆలోచిస్తాడు. అంత‌కు మించి రేంజ్ ఉన్న హీరోల కోసం పాకులాడుంతుంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా క‌నిపిస్తోన్న స‌న్నివేశం ఇదే. కొంత మంది డైరెక్ట‌ర్లు ఏకంగా స్టార్ హీరోల‌కే గురిపెడ‌తారు.

విలువైన స‌మ‌యాన్ని కోల్పోతున్నారు:

టైర్ 2 హీరోలు గానీ, టైర్ 3 హీరోల‌ను గానీ అస్స‌లు ట‌చ్ చేయ‌రు. వాళ్లు డేట్లు ఇచ్చినా సినిమా చేయ‌డానికి నిరాక‌రి స్తుంటారు. వాళ్ల మైండ్ లో స్టార్ హీరోలే ర‌న్ అవుతుంటారు. ఎలాగూ అపాయింట్ మెంటు సంపాదించి స్టోరీ చెప్పి ఒప్పిస్తారు. కానీ ప్రాజెక్ట్ మాత్రం ఎంత‌కు ప‌ట్టాలెక్క‌దు. ఇదిగో ..అదిగో అని ప్ర‌చారం త‌ప్ప ప్రారంభోత్స‌వం ఉండ‌దు. ఒక‌వేళ జ‌రిగినా? రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌డానికి నెల‌లు స‌మ‌యం ప‌డుతుంటుంది. ఈ క్ర‌మంలో ఇలాంటి డైరెక్ట‌ర్లు అంతా త‌మ విలువైన స‌మ‌యాన్ని కోల్పోతున్నారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఆ కార‌ణంగా కొంత ఆదాయాన్ని కూడా కోల్పోతున్నారు.

స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కుల స‌మాధానం ఏంటి?

ఇదే విష‌యాన్ని ఆ డైరెక్ట‌ర్ల వ‌ద్ద ప్ర‌స్తావిస్తే మాత్రం ఒప్పుకోరు. అబ్బే అలాంటిదేం లేదు. హీరోతో ఏ ప్రాబ్ల‌మ్ లేదు. తానే కావాల‌ని డిలే చేస్తున్న‌ట్లు మాట్లాడుతారు కోంద‌రు డైరెక్ట‌ర్లు. ఈ మ‌ధ్య కాలంలో ఒక‌టి రెండు స‌క్సెస్ లు అందుకుని ఎదురు చూస్తోన్న డైరెక్ట‌ర్ల లో చాలా మంది నుంచి వ‌చ్చిన స‌మాధానం ఇదే. ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ల ఆలోచ‌నా విధానం మారాల‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మినిమం మార్కెట్ ఉన్న హీరోల‌తో సినిమాలు చేస్తే త‌ప్పేంటి? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతున్నారు. మ‌రి దీనికి స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కులు ఎలాంటి బ‌ధులిస్తారో చూడాలి.

Tags:    

Similar News