అడ్వాన్సుల 'ట్రాప్'.. స్టార్ డైరెక్టర్లు అందుకే రిస్క్ చెయ్యరు!
ఒకప్పుడు మన ఇండస్ట్రీలో సీన్ వేరేలా ఉండేది. టాప్ డైరెక్టర్లు ఏడాదికి రెండు, మూడు, ఒక్కోసారి ఐదారు సినిమాలు కూడా చకచకా తీసేసేవాళ్లు.;
ఒకప్పుడు మన ఇండస్ట్రీలో సీన్ వేరేలా ఉండేది. టాప్ డైరెక్టర్లు ఏడాదికి రెండు, మూడు, ఒక్కోసారి ఐదారు సినిమాలు కూడా చకచకా తీసేసేవాళ్లు. అప్పుడు ప్రొడ్యూసర్లు క్యూ కట్టి అడ్వాన్సులు ఇచ్చేవాళ్లు, డైరెక్టర్లు కూడా ఒకేసారి నాలుగైదు బ్యానర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం చాలా కామన్‌గా జరిగేది. అప్పటి పరిస్థితులు, సినిమాల ఫలితాలు వేరు.
కానీ, పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక, గేమ్ పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు ఒక సినిమా అంటే మినిమమ్ రెండేళ్ల ప్రయాణం. బడ్జెట్లు వందల కోట్లకు చేరాయి. దీంతో, ఏడాదికి 3, 4 సినిమాలు తీసే కాన్సెప్టే పోయింది. అందుకే, రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్లు ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా అడుగులేస్తున్నారు. చాలా మంది ఆఫర్ చేసినా, వాళ్లు మల్టిపుల్ అడ్వాన్సులు తీసుకునే రిస్క్ చేయడం లేదు.
దీనికి అసలు కారణం హీరోల ఫ్యాక్టర్. ఒకప్పుడు ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చి డైరెక్టర్‌ను లాక్ చేస్తే, ఆ తర్వాత హీరోను సెట్ చేసుకోవచ్చు అనుకునేవారు. కానీ ఇప్పుడు, ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చినంత మాత్రాన ప్రాజెక్ట్ సెట్ అవ్వడం లేదు. హీరోలు కథల విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు, అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. హీరో డైరెక్టర్ కాంబినేషన్ కుదిరితే తప్ప, ప్రొడ్యూసర్ ముందుకెళ్లలేని పరిస్థితి.
అందుకే, స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు ఒకేసారి ఒక హీరోతో, ఒక ప్రొడ్యూసర్‌తో మాత్రమే కమిట్ అవుతున్నారు. లేదంటే, అనవసరమైన తలనొప్పులు, పంచాయితీలు వస్తాయని వాళ్లకు తెలుసు. కానీ, రీసెంట్‌గా కొంత మంది యంగ్ డైరెక్టర్స్ మాత్రం, ఈ పాత ఫార్ములాను నమ్మినట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది.
ఒక్క హిట్ ఇచ్చిన క్రేజ్‌తో, ఒకేసారి ప్రొడ్యూసర్ల దగ్గర భారీ అడ్వాన్సులు తీసుకుంటే రిస్క్ తప్పదని ఇదివరకే చాలా ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజుల్లో, అంత మందికి ఒకేసారి సినిమా చేయడం అసాధ్యం. నేను డైరెక్ట్ చేయను, స్టోరీ ఇస్తా, సూపర్‌వైజ్ చేస్తా అని కొత్త ఆఫర్లు ఇస్తున్నారని కూడా అంటున్నారు . కానీ ప్రొడ్యూసర్లు మాత్రం అలాంటి ఆఫర్లకు లొంగడం లేదు, లేదంటే డబ్బు వెనక్కి ఇవ్వు అని గట్టిగా చెబుతున్నారు. ఇక తొందరపాటుతో ఆ అడ్వాన్సులన్నీ ఖర్చయితే కొలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే, స్టార్ డైరెక్టర్లు ఈ 'మల్టిపుల్ అడ్వాన్స్' రిస్క్ అంటేనే భయపడుతున్నారు. సేఫ్ సినిమా మార్కెట్ లో షేర్ తీసుకుంటూ నిర్మాతతో సమానంగా నడుస్తున్నారు.