డైరెక్టర్ ప్లాప్ ల్లో ఉన్నా అదే దూకుడు!
గత విజయాల నేపథ్యంలో మాత్రమే తదుపరి రిలీజ్ లపై అంతటి బజ్ నెలకొంటుంది. టాలీవుడ్ లో అలాంటి కొంత మంది డైరెక్టర్లు ఉన్నారు.;
డైరెక్టర్ ప్లాప్ ల్లో ఉన్నా? ఒకే దూకుడు కొనసాగించడం అన్ని వేళలా అందరికీ సాధ్యపడదు. అది కొందరికే సాధ్యం. గత విజయాల నేపథ్యంలో మాత్రమే తదుపరి రిలీజ్ లపై అంతటి బజ్ నెలకొంటుంది. టాలీవుడ్ లో అలాంటి కొంత మంది డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల రీసెంట్ సినిమాలు ప్లాప్ అయినా తదుపరి రిలీజ్ లపై మాత్రం భారీ అంచనా లున్నాయి. ఆలాంటి కాంబినేషన్లు ఓ సారా ట్రాక్ చేస్తే సరి... బోయపాటి శ్రీను బాలయ్య కథానాయకుడిగా `అఖండ 2` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య వరుస విజయాలతో స్వింగ్ లో ఉన్నా బోయపాటి మాత్రం ప్లాప్ ల్లోనే ఉన్నాడు.
గత విజయాలతోనే ఇలా:
బోయపాటి గత సినిమా `స్కంద` ప్లాప్ అయింది. కానీ ఆ ప్రభావం `అఖండ 2`పై ఎంత మాత్రం ప్రభావం పడలేదు. `అఖండ` భారీ విజయం సాధించడం...బాలయ్య వరుస విజయాల్లో ఉన్న నేపథ్యంలో `అఖండ2`పై భారీ అంచనాలున్నాయి. అలాగే హరీష్ శంకర్ హిట్ కొట్టి చాలా కాలమవుతుంది. `గబ్బర్ సింగ్` తర్వాత హరీష్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రకటించగానే ఒక్కసారిగా బజ్ పీక్స్ లో మొదలైంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో హిట్ అయిన `గబ్బర్ సింగ్` కారణంగానే ఈ రేంజ్ లో అంచనా లున్నాయి.
ప్లాప్ అయినా అదే బజ్:
పవన్ క్రేజ్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించింది. మార్కెట్ లో అతడికి ఉన్న ఇమేజ్ అలాంటింది. అలాగే డ్యాషిం గ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ `ఇస్మార్ట్ శంకర్` తర్వాత `లైగర్`, `డబుల్ ఇస్మార్ట్` రూపంలో రెండు భారీ పరాజయాలు చూసారు. కానీ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా ప్రకటించే సరికి ఆ ప్లాప్ లు అన్ని పక్కకు తొలగిపో యాయి. ఇద్దరి కాంబోలో ఓ గొప్ప సినిమా వస్తుంది? అన్న అంచనాలు మొదలయ్యాయి. కిషోర్ తిరుమల గత చిత్రాలు రెండు `రెడ్`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఆశించిన ఫలితాలు సాధించలేదు.
ఆన్ సెట్స్ చిత్రాలతో క్రేజీగా:
కానీ అదే దర్శకుడు రవితేజతో సినిమా తీస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ రాజాని కొత్తగా ప్రజెంట్ చేస్తాడు? అన్న కోణంలో ఆ కాంబో హైలైట్ అవుతోంది. నాలుగేళ్లగా మారుతి నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ అవ్వ లేదు. గత సినిమా `పక్కా కమర్శియల్` కూడా ప్లాప్ అయింది. అంతకు ముందు తీసిన సినిమాలు యావరేజ్ గా ఆడాయి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `రాజాసాబ్` ప్రకటించడంతో? అంచనాలు పీక్స్ కే చేరాయి. దీంతో మారుతి ఇమేజ్ కూడా మారిపోయింది. ఇలా ఈ నలుగురు దర్శకుల గత చిత్రాలు ప్లాప్ అయినా ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలతో క్రేజీగా మారారు.