దీపావళి బాక్సాఫీస్.. జనాలు మళ్లీ టికెట్‌ కొంటారా?

టాలీవుడ్‌లో "జనం థియేటర్‌కు రావడం తగ్గించారు" అనే అనే మాట ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలోనే బాగా వినిపించింది.;

Update: 2025-10-10 05:07 GMT

టాలీవుడ్‌లో "జనం థియేటర్‌కు రావడం తగ్గించారు" అనే అనే మాట ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలోనే బాగా వినిపించింది. దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా నమ్ముతున్నారు కూడా. టిక్కెట్ రేట్లు, పాప్ కార్న్ వంటి స్నాక్స్ రేట్లు ఎక్కువగా ఉండటంపై కూడా ప్రేక్షకుల నుంచి కామెంట్లు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ అపోహలన్నీ ఇటీవలి కొన్ని విజయాలతో కొట్టుకుపోయాయి. సెప్టెంబరులో మిరాయ్, కిష్కింధపూరి, లిటిల్ హార్ట్స్ లతో మొదలై, OG వరకు బాక్సాఫీస్ వద్ద హడావుడి కనిపించింది.

అక్టోబర్ ఫస్ట్ లో దసరా సమయంలో 'కాంతార: చాప్టర్ 1' ఏకంగా తెలుగులోనే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కంటెంట్ బాగుంటే జనం ఖచ్చితంగా వస్తారని ఈ సినిమాలు నిరూపించాయి.

​బాక్సాఫీస్ 'ఖర్చు' భయం

​ఇప్పుడు అందరి దృష్టి దీపావళి వీకెండ్ పైనే ఉంది. ఒకే వారం, నాలుగు వేర్వేరు ప్రాజెక్టులు ఒకేసారి రావడం అనేది కొంత రిస్క్. అయితే, ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో వరుసగా సినిమాలు చూసిన మధ్యతరగతి ఆడియెన్స్, దీపావళి సమయంలో మళ్లీ కుటుంబంతో కలిసి సినిమా కోసం అంత డబ్బు ఖర్చు చేయగలరా? అనేది అసలు సందేహం. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంత తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం అనేది మధ్యతరగతి ప్రేక్షకులకు ఒక పెద్ద డైలమా.

​పండుగ టైమ్‌లో అందరూ అన్ని లెక్కలు వేసుకుంటారు కాబట్టి, ఎంటర్‌టైన్‌మెంట్ వైపు రానున్న సినిమాల కోసం అదనంగా ఎంత ఖర్చు చేస్తారనేది అసలు సమస్య. జనాలు ఖచ్చితంగా థియేటర్‌కు వస్తారు. కానీ, ఒకే వారంలో నాలుగు సినిమాలు వస్తుంటే, దేన్ని ఎంచుకోవాలి? అనేది కష్టం. అందుకే దీపావళి బాక్సాఫీస్ ఇప్పుడు కేవలం 'టాక్' మీద కాకుండా, ప్రేక్షకుల ఖర్చు పెట్టే శక్తిపై కూడా ఆధారపడి ఉంది.

​నవంబరు 16న 'మిత్రమండలి', 17న 'తెలుసు కదా' 'డూడ్', 18న 'కే ర్యాంప్' సినిమాలు పోటీలో ఉన్నాయి. ప్రేక్షకులను అద్భుతమైన కంటెంట్ ద్వారానే థియేటర్ వైపు లాగే సినిమా ఈ పోటీలో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. కంటెంట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే, మౌత్ టాక్ తేడా వస్తే, ఆ డబ్బును వేరే దానికి వాడుకోవడానికి ప్రేక్షకులు వెనకాడరు.

​ఎంటర్‌టైన్‌మెంట్ క్లాష్

​ఈ పోటీలో 'తెలుసు కదా' (రొమాంటిక్), 'డూడ్' (తమిళ డబ్బింగ్ యూత్ ఫేవరెట్) సినిమాల మధ్య అసలు క్లాష్ నడుస్తున్నా.. కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' (బోల్డ్ కామెడీ), 'మిత్రమండలి' (ఎంటర్‌టైనర్) కూడా యూత్‌ను టార్గెట్ చేశాయి. అయితే, ఫ్యామిలీ ఆడియేన్స్ బడ్జెట్ పరిమితి కారణంగా, ఈ నాలుగు సినిమాల్లో 'గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్' అనిపించుకున్న ఒక్క సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ​మొత్తానికి, ఈ దీపావళి బాక్సాఫీస్ ఫలితం సినిమా కంటెంట్ తో పాటు, ప్రేక్షకుల పర్సుకి కూడా ఒక పరీక్షగా మారనుంది. జనం వస్తారు, కానీ అందరూ రారు. ఖచ్చితంగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ కంటెంట్ ఉంటే తప్ప, ఈ పోటీలో లీడ్ తీసుకోవడం కష్టమే.

Tags:    

Similar News