అందరి కన్ను టాలీవుడ్ మీదే.. ఎందుకు..?

ప్రస్తుతం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ని సైతం షేక్ చేస్తున్న ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడ స్టార్ సినిమాలు నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి.;

Update: 2025-08-05 10:30 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ని సైతం షేక్ చేస్తున్న ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడ స్టార్ సినిమాలు నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. ఐతే మన స్టార్స్ ఏమో పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ పై గురి పెడితే.. మన టాలీవుడ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు ఇతర భాషల హీరోలు. మన స్టార్స్ చేస్తే నేషనల్ వైడ్ సినిమాలు చేస్తున్నారు.

అందుకే వాళ్లకి ఇదొక గొప్ప అవకాశం గా మారింది. అందుకే ఇక్కడ టైర్ 2 హీరోల సినిమాలకు పోటీగా వారి సినిమాలు చేస్తున్నారు. ఒక మంచి సినిమా ఏదైనా తెలుగు ఆడియన్స్ ముందుకొస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ ఆడియన్స్ ని సినిమా చూడమని ఎవరు బలవంతం చేయలేదు. కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా సరే వాళ్లకి నచ్చనిదే హిట్ చేయరు.

తెలుగు ఆడియన్స్ కి సినిమా టేస్ట్..

తెలుగు ఆడియన్స్ కి ఉన్న ఈ సినిమా టేస్ట్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు మిగతా హీరోలు. ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దుల్కర్ సత్తా చాటుతున్నాడు. అదేంటో అతను చేస్తున్న సినిమాలన్నీ డిఫరెంట్ కథలే. అన్నీ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా దుల్కర్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.

ఇదే వరసలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కూడా తెలుగులో ఛాన్స్ లు అందుకుంటున్నాడు. ఆల్రెడీ జై హనుమాన్ కి సైన్ చేసిన రిషబ్. సితార బ్యానర్ లో ఒక పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పడితే రిషబ్ కి తెలుగు మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది.

వీరితో పాటు తమిళ హీరో కార్తి కూడా తెలుగు బాక్సాఫీస్ పై గురి పెట్టాడు. ఆల్రెడీ ఊపిరి సినిమాతో మన ఆడియన్స్ ని అలరించాడు కార్తి. నెక్స్ట్ హిట్ 4 తో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ హీరోలంతా తాము ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులో డబ్ చేస్తూ క్రేజ్ సంపాధిస్తున్నారు.

Tags:    

Similar News