పిక్‌టాక్ : వర్కౌట్ ఔట్ ఫిట్‌లో ఇస్మార్ట్ బ్యూటీ
కన్నడ మూవీ వజ్రకాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నభా నటేష్ ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు దక్కించుకుంది.;
కన్నడ మూవీ వజ్రకాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నభా నటేష్ ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు దక్కించుకుంది. కన్నడ అమ్మాయి కావడంతో అక్కడి ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో విజయాలు నమోదు కాలేదు. దాంతో ముద్దుగుమ్మ నభా నటేష్‌కి పెద్దగా సక్సెస్‌లు దక్కలేదు. తెలుగులో ఈమె చేసిన మొదటి సినిమా నన్ను దోచుకుందువటే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆ సినిమాలో ఈమె పోషించిన పాత్రకు మంచి మార్కులు దక్కాయి, నటిగానూ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, అన్ని వర్గాల వారికి నచ్చింది.
తెలుగులో 2019లో ఈమె చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ కరోనా కారణంగా ఈ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ విజయం ఆఫర్లను తెచ్చి పెట్టలేక పోయింది. కానీ ఇటీవల ఈమె మెల్ల మెల్లగా బిజీ అవుతోంది. గత ఏడాది డార్లింగ్ అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బిజీగా ఉన్న ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. సాధారణంగానే అందంగా కనిపించే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ స్కిన్ షో చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా ఈమె జిమ్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వర్కౌట్ డ్రెస్‌లో నార్మల్‌గానే ముద్దుగుమ్మలు చాలా ముద్దుగా ఉంటారు. పైగా నభా నటేష్ టైట్ షార్ట్ ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అందమైన ఇస్మార్ట్ బ్యూటీకి అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. అందుకే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసిన వెంటనే లక్షల మంది లైక్ చేయడం మాత్రమే కాకుండా ఫోటోను షేర్ చేస్తూ, వావ్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. బ్లాక్ ఔట్ ఫిట్‌లోనూ మెరిసి పోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ను ఎంత పొగిడినా తక్కువే అంటూ అభిమానులు సైతం నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కర్ణాటకలోని శృంగేరిలోని పాఠశాలకు వెళ్లిన ఈమె ఉడిపిలోని ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివింది. జాతీయ అవార్డ్ గ్రహీత ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్న ఈమె అనేక పోటీల్లో పాల్గొని విజయాలను సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభం నుంచే నటనపై శ్రద్ద పెడుతూ వచ్చిన ఈమె పలు సినిమాల్లో మెప్పించింది. కానీ లక్ కలిసి రాలేదు. ఈమెకు ముందు ముందు అయినా సినిమాల్లో మంచి విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఈమె ముందు ముందు హీరోయిన్‌గా బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతటి అందగత్తకు ఇంతకు మించి అన్నట్లుగా రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.