థియేటర్లలో వరుస సంచలనాలకు కౌంట్‌డౌన్.. 2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్ రిలీజ్ డేట్స్ ఇవే!

ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసుకోగా, మరికొన్ని అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలు థియేటర్లకు కొత్త ఊపు తీసుకురావాలని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Update: 2026-07-03 09:23 GMT

2026 తొలి ఆరు నెలల్లో టాలీవుడ్ నుంచి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్ స‌క్సెస్‌లు సాధించగా, మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి మొత్తం 2026 సెకండాఫ్‌పైనే ఉంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా స్టార్ హీరోల భారీ సినిమాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతుండ‌టంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసుకోగా, మరికొన్ని అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలు థియేటర్లకు కొత్త ఊపు తీసుకురావాలని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సెప్టెంబర్ 25న నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యార‌డైజ్ రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రారంభం నుంచే భారీ హైప్ ఏర్పడింది. దానికి తోడు ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ ఆలస్యాల కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అక్టోబర్ నెలలో మాత్రం బాక్సాఫీస్ వద్ద అసలైన పోటీ కనిపించనుంది. అక్టోబర్ 15న రజినీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్2 రిలీజ్ కానుందని తెలుస్తోంది. జైల‌ర్ సినిమా సాధించిన ఘనవిజయం కారణంగా ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరను అక్టోబర్ 16న దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టీజర్‌కు వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ తో పాటూ విజువల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్స్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండు భారీ సినిమాలు రిలీజైతే దసరా బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

ఇక నవంబర్ 6న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఈ జంటకు ఉన్న క్రేజ్, పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న మొద‌టి సినిమా కావడం వల్ల ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక డిసెంబర్‌లో పాన్ ఇండియా స్థాయిలో రెండు భారీ సినిమాలు వరుసగా రిలీజ‌య్యే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 3న ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫౌజీ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్‌గా పరిచయం కానుంది.

త‌ర్వాత డిసెంబర్ 4న నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK111 రిలీజ్ కానుందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా చూస్తే 2026 సెకండాఫ్‌లో స్టార్ హీరోల వరుస రిలీజ్‌ల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌కు అత్యంత కీలకమైన సీజన్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News