• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తొలిప్రేమ దర్శకుడికి...

తొలిప్రేమ దర్శకుడికి ఇన్నాళ్ళకు ఓ లక్కీ ఛాన్స్

| ఇక తొలిప్రేమ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాడు కానీ తొలిప్రేమ లాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.

By - Tupaki Desk
Update: 2024-10-15 00:30 GMT

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా తొలిప్రేమ సినిమాను అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి. ఇప్పుడు చూసిన కూడా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. రీ రిలీజ్ టైం లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందించింది. పవన్ కళ్యాణ్ కేతిర్ లోనే ఈ సినిమానే మొదటి బిగ్గెస్ట్ హిట్.

ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. పవన్ బాక్సాఫీస్ కెరీర్ కు ఈ సినిమా ఒక మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తొలిప్రేమ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాడు కానీ తొలిప్రేమ లాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2010లో ప్రభాస్ తో చేసిన డార్లింగ్ సినిమా అతనికి చివరి విజయం.

ఆ తర్వాత చేసిన సినిమాలు వరసగా డిజాస్టర్ అయ్యాయి. 2018 లో సాయి ధరమ్ తేజ్ తో 'తేజ్ ఐ లవ్ యు' అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత అతను మళ్లీ కనిపించలేదు. మధ్య మధ్యలో ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు అని కథనాలు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక ఇన్నాళ్లకు ఈ దర్శకుడు మళ్ళీ సీరియస్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వర్క్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా దిల్ రాజు లాంటి కాంపౌండ్ లోనే సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

దిల్ రాజు తన బ్రదర్ కుమారుడు ఆశిష్ రెడ్డితో విభిన్నమైన సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా అతన్నీ హీరోగా నిలబెట్టాలని చాలామంది దర్శకులతో కొత్త కథలపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ క్రమంలో కరుణాకరన్ రావడంతో ఆయనకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ దర్శకుడు ఎక్కువగా ప్రేమ కథలు ఎక్కువగా రాసుకున్నాడు. మరి ఇప్పుడు అతను ఆశిష్ రెడ్డితో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Tags:    
  • Pawankalyan 
  • Tholiprema 
  • Karunakaran 
  • Saidharamtej 
  • Tejiloveyoumovie 
  • Dilraju 
  • Ashishreddy 
  • Lovestories 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS