'ది రెడ్ బ్యాగ్' ట్విస్టులే అసలు బలం: నిర్మాత హరికృష్ణ
సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ది రెడ్ బ్యాగ్ సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలోకి రాబోతోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ది రెడ్ బ్యాగ్ సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలోకి రాబోతోంది. మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించగా, రవికుమార్ సీరపు డైరెక్ట్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, కంటెంట్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇటీవల ప్రొడ్యూసర్ హరికృష్ణ సినిమా అవుట్ పుట్ గురించి, ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన గ్లింప్స్, టీజర్, పాటలకు జనం నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని నిర్మాత చెప్పారు. యూట్యూబ్ లో కూడా ఈ కంటెంట్ బాగా ట్రెండ్ అయిందని గుర్తుచేశారు. ముఖ్యంగా సినిమా చాలా స్టైలిష్ గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయంటూ తమకు చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోందని హరికృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రేక్షకులు బయట చూసిన కంటెంట్ కంటే థియేటర్లో చూసే ఫుల్ మూవీ పదింతలు ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుందని నిర్మాత చాలా నమ్మకంగా చెబుతున్నారు. ముఖ్యంగా కథలో వచ్చే ట్విస్టులను ఎవరూ ముందే గెస్ చేయలేరని, క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతుందని అంటున్నారు. కేవలం థ్రిల్లర్ లాగే కాకుండా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా కలపడంతో అన్ని రకాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడంలో నటీనటులతో పాటు టెక్నికల్ టీమ్ సపోర్ట్ చాలా ఉందని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. కథలో ఉన్న సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూనే ప్రమోషన్స్ ను కూడా అదే థ్రిల్లింగ్ మూడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు మేకర్స్ దృష్టి అంతా ఆగస్ట్ 21 రిలీజ్ మీదే ఉంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ కు సపోర్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్స్ లో గ్రాండ్ గా విడుదల చేసే అవకాశం దొరికింది. ఒక చిన్న సినిమాకు ఇలాంటి బ్యాకింగ్ రావడం నిజంగా రిలీజ్ టైమ్ లో పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన ది రెడ్ బ్యాగ్ ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి రెడీ అయిపోయింది. నిర్మాత చెబుతున్న మాటలను బట్టి చూస్తే కథలోని ట్విస్టులే ఈ సినిమాకు అసలు బలంగా నిలవబోతున్నాయని అర్థమవుతుంది. మరి ఆయన నమ్మకాన్ని ఈ ట్విస్టులు ఎంతవరకు నిలబెడతాయో, ప్రేక్షకులను ఏ స్థాయిలో థ్రిల్ చేస్తాయో చూడాలి.