త్వరలోనే ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్.. ఆయా షేర్‌ను మించేలా ఉంటుందా?
ఆయా షేర్ కు వచ్చిన భారీ వ్యూస్, సోషల్ మీడియాలో కనిపించిన ట్రెండ్ సినిమాకు మ్యూజిక్ ఎంత కీలకంగా మారిందో చెప్పకనే చెబుతున్నాయి.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా షేర్ సాంగ్ సినిమాకు కావాల్సిన మ్యూజికల్ బజ్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు రాబోయే సెకండ్ సింగిల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఫస్ట్ సాంగ్ భారీ స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోవడంతో సహజంగానే తర్వాతి పాటపై కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ఉంటుందా అనే డిస్కషన్ మొదలైంది.
ఆయా షేర్ కు వచ్చిన భారీ వ్యూస్, సోషల్ మీడియాలో కనిపించిన ట్రెండ్ సినిమాకు మ్యూజిక్ ఎంత కీలకంగా మారిందో చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. దీంతో సెకండ్ సాంగ్ విషయంలో ఆడియన్స్ అంచనాలు సాధారణ స్థాయిలో లేవు. ఫస్ట్ సింగిల్‌ను మించి కొత్తగా ఏదైనా చూపించగలరా అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇక ఈసారి సెకండ్ సాంగ్ విషయంలో మరో అంశం కూడా క్యూరియాసిటీని పెంచుతోంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల షేర్ చేసిన స్టూడియో ఫొటోలో అనిరుధ్ రవిచందర్, ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సెకండ్ సాంగ్ రికార్డ్ పూర్తైన సందర్భంగా అనిరుధ్, కాసర్ల శ్యామ్ ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా కనిపించడం ఈ పాట స్వభావంపై కొత్త ఊహాగానాలకు తెరలేపింది.
కాసర్ల శ్యామ్ సాంగ్స్ లో కనిపించే తెలంగాణ నేటివిటీ, మాస్ పదజాలం, స్థానిక జీవనశైలికి దగ్గరగా ఉండే లిరికల్ ఫ్లేవర్‌కు స్పెషల్ ఐడెంటిటీ ఉంది. మరోవైపు అనిరుధ్ మ్యూజిక్ కు ఎనర్జీ, మాస్ అప్పీల్ ప్రధాన బలాలు. ఈ ఇద్దరి కలయికలో సాంగ్ వస్తుండటంతో ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్‌లో లోకల్ ఫ్లేవర్‌తో పాటు హై ఎనర్జీ ఉండొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే సాంగ్ ఎలా ఉండబోతుందనే విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆసక్తి మరింత కొనసాగుతోంది.
రీసెంట్ గా సినిమా నుంచి రిలీజైన టీజర్ కూడా ది ప్యారడైజ్ వరల్డ్ ను మరింత ఇంటెన్స్‌గా పరిచయం చేసింది. ఆ విజువల్ బజ్‌కు ఇప్పుడు మ్యూజిక్ బజ్ కూడా తోడవుతోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో, సెకండ్ సింగిల్ ప్రమోషన్స్‌కు మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఆయా షేర్ సక్సెస్ తర్వాత సెకండ్ సాంగ్‌కు అంచనాలు పెరగడం ఒకవైపు సవాలే అయినా, అనిరుధ్–కాసర్ల శ్యామ్ కాంబినేషన్ మరోవైపు సినిమాకు కొత్త క్యూరియాసిటీని తీసుకొచ్చింది. మరి ఈ అంచనాలను సెకండ్ సింగిల్ ఏ స్థాయిలో అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.