సినిమాతో కంటే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో మంచి గుర్తింపు..!

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో 'దసరా' తర్వాత భారీ అంచనాల నడుమ రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ది ప్యారడైజ్‌'.

Update: 2026-09-26 01:30 GMT

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో 'దసరా' తర్వాత భారీ అంచనాల నడుమ రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ది ప్యారడైజ్‌'. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించినప్పటి నుంచి బజ్‌ పెరుగుతూ వచ్చింది. దాంతో సినిమా భారీ మొత్తంలో బిజినెస్ చేసిన విషయం తెల్సిందే. నాని కెరీర్‌లోనే మొదటి సారి రూ.100 కోట్ల ప్రీ రిలీజ్‌ థియేట్రికల్‌ బిజినెస్ చేసిన సినిమాగా ది ప్యారడైజ్ నిలిచింది. సినిమాకు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ కావడంలో చాలా ఎలిమెంట్స్ పనిచేశాయి. అందులో ఒకటి బాలీవుడ్‌ నటుడు రాఘవ్‌ జుయెల్‌ కావడం విశేషం. ఈయన బాలీవుడ్‌ మూవీ కిల్‌తో ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో రాఘవ్‌ నటిస్తున్నాడు అంటే ఆ సినిమాకు హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అవుతుంది. ది ప్యారడైజ్ మూవీలో రాఘవ్‌ నటించాడు అనే ప్రకటనతో హిందీలో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది.

ది ప్యారడైజ్‌ మూవీలో రాఘవ్‌ పాత్ర...

సినిమాలో రాఘవ్‌ పాత్ర విషయమై చాలా ప్రచారం జరిగింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఒక ఇంటర్వ్యూలో ఒక పాత్ర కోసం నటుడిని దాదాపు ఎనిమిది నెలలు వెతికాం. ఎంతో మందిని ఆడీషన్స్ చేసిన తర్వాత చివరకు హిందీ నటుడు రాఘవ్‌ ను ఎంపిక చేయడం జరిగిందని చెప్పాడు. దాంతో సినిమాలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత విషయమై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. అంతే కాకుండా సినిమాలో ఆ పాత్ర తో నాని పాత్రకు ఉండే సన్నివేశాలపై కూడా అంచనాలు పెరిగాయి. నాని వర్సెస్‌ రాఘవ్‌ అన్నట్లుగా చాలా మంది ఊహించుకున్నారు. కానీ సినిమాలో ఊహించుకున్నంత లేదు అంటూ చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కిల్‌ విలన్‌ రాఘవ్‌ ఎక్కడ అంటూ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ మూవీలో అతడు ఉంటాడు అని ఎక్కువ ప్రచారం చేశారు, కానీ మెరుపు తీగ మాదిరిగా ఇలా వచ్చి అలా వెళ్లి పోయాడు కదా అంటూ విమర్శలు వస్తున్నాయి.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో మూవీ...

ది ప్యారడైజ్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాఘవ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే. ఆయా షేర్‌తో పాటు, ఏషనాగుల గడ్డ పాటకు సైతం డాన్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు రాఘవ్‌ గురించి ప్రముఖంగా చర్చించుకున్నారు. ముఖ్యంగా యాంకర్‌ సుమతో రాఘవ్‌ చేసిన డాన్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రీల్స్ రూపంలో మిలియన్స్‌ వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. దాంతో రాఘవ్‌ కి సినిమా విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్‌ దక్కింది. హిందీ నటుడు అయినప్పటికీ తెలుగులో ఇతడు ఇదే మొదటి సినిమా చేస్తున్నప్పటికీ కచ్చితంగా టాలీవుడ్‌లో ముందు ముందు చాలా పెద్ద స్టార్‌గా నిలవడం ఖాయం అని చాలా మంది విశ్లేషించారు. తీరా సినిమా విడుదల తర్వాత చూస్తే ఢొల్లా అంటూ ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శ్రీకాంత్‌ ఏమాత్రం రాఘవ్‌ ప్రతిభను వినియోగించుకోలేదు అని రివ్యూలు వస్తున్నాయి.

నాని ది ప్యారడైజ్ మూవీతో...

సినిమా ఫలితం విషయం పక్కన పెడితే అసలు రాఘవ్‌ పాత్ర పరిధి ఎంత అనే విషయమై చర్చ ప్రధానంగా జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవ్‌ కనిపించినంత సమయం కూడా సినిమాలో కనిపించలేదు అంటూ విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. సినిమాతో రాఘవ్‌ కి మంచి గుర్తింపు వస్తుంది, స్టార్‌గా నిలుస్తాడు అంటూ గొప్ప గొప్ప ప్రకటనలు చిత్ర యూనిట్‌ సభ్యులు చేశారు. తీరా చూస్తే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కనిపించినదాని కంటే కూడా తక్కువ సమయం సినిమాలో కనిపించడంతో పాటు, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అంటూ కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. సినిమా బిగినింగ్‌లో రాఘవ్‌ పాత్ర చూసి ఆహా... అనుకున్నారు. తీరా చూస్తే మధ్యలోనే ముగించాడు. పైగా నాని తో సమానమైన పాత్ర కాదు కదా, కనీసం సంపూర్నేష్‌ బాబుకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ ఎక్స్ లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రాఘవ్‌ ప్రతిభను తెలుగు ప్రేక్షకులు చూడాలి అంటే మరో సినిమాతో వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News