ఈ KGF రోత ఇంకెన్నాళ్లు?

కింగ్‌డమ్ కూడా వేరే కథే. కానీ అక్కడ ఐలాండ్‌లో నలిగిపోయే జనాలు, వాళ్లను కంట్రోల్ చేసే శక్తివంతమైన గ్రూప్, ఆ ప్రపంచంలోకి వెళ్లిన హీరో చివరకు వాళ్ల కోసం నిలబడటం చూస్తే అదే టెంప్లేట్ మరో రూపంలో కనిపిస్తుంది.

Update: 2026-09-24 04:45 GMT

కేజీఎఫ్ వచ్చినప్పుడు ఆ వరల్డ్ కొత్తగా అనిపించింది. బానిసలాగా బతికే జనాలు, వాళ్లపై పెత్తనం చేసే వ్యవస్థ, అక్కడి నుంచి పైకి వచ్చే హీరో, మధ్యలో మదర్ సెంటిమెంట్.. ప్రశాంత్ నీల్ ఆ ఫార్ములాను భారీ మాస్ సినిమాగా మార్చాడు. కానీ ఆ హిట్ తర్వాత అదే టెంప్లేట్ చాలా సినిమాల్లో కనిపించాయి. ఇప్పుడు ది ప్యారడైజ్ చూస్తే కూడా ఆ పోలిక వెంటనే గుర్తుకొస్తోంది.

ప్యారడైజ్‌లో కూడా ఒక పేద కమ్యూనిటీ ఉంటుంది. వాళ్లపై శికంజా మాలిక్ ఆధిపత్యం, ఆయన కొడుకు పైత్యం చూపించడం.. ఆ ప్రపంచం నుంచి జడల్ ఎదగడం, సమ్మక్కతో మదర్ ఎమోషన్.. బేసిక్ సెటప్ దగ్గర కేజీఎఫ్ షేడ్స్ ఉన్నాయి. దానికి డార్క్ విజువల్స్, భారీ బీజీఎం, ఓవర్ ద టాప్ ఎలివేషన్స్, ఎక్కువ వయలెన్స్ కలవడంతో ఆ ఫీలింగ్ పెరుగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ బాగున్నా, మొత్తం సినిమా మీద మాస్ ఓవర్‌డోస్ కంప్లైంట్ వినిపిస్తోంది.

ప్యారడైజ్ ఒక్కటే కాదు. కబ్జా వచ్చినప్పుడే కేజీఎఫ్ పోలికలు ఎక్కువగా వినిపించాయి. అదే డార్క్ కలర్ టోన్, అండర్‌వరల్డ్ సెటప్, హీరో ఎదుగుదల, మదర్ ఎమోషన్.. అక్కడైతే పోలికలు మరీ దగ్గరగా కనిపించాయి. సలార్ కథ వేరైనా, వేరే ప్రపంచం కట్టి అందులో పవర్ఫుల్ గ్రూపులు, భారీ విలన్లు, హీరో చుట్టూ ఎలివేషన్స్ పెట్టే గ్రామర్ మళ్లీ అదే దారిలో వెళ్లింది.

కింగ్‌డమ్ కూడా వేరే కథే. కానీ అక్కడ ఐలాండ్‌లో నలిగిపోయే జనాలు, వాళ్లను కంట్రోల్ చేసే శక్తివంతమైన గ్రూప్, ఆ ప్రపంచంలోకి వెళ్లిన హీరో చివరకు వాళ్ల కోసం నిలబడటం చూస్తే అదే టెంప్లేట్ మరో రూపంలో కనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ బదులు బ్రదర్ ఎమోషన్ పెట్టారు. దేవరలో కూడా సముద్రం, గ్రామాలు, భయం, అధికారం, హీరో చుట్టూ నిర్మించిన మాస్ సెటప్ కొన్ని చోట్ల అదే ఫీలింగ్ ఇస్తుంది.

అసలు సమస్య ఒక సినిమా ఇంకో సినిమాను కాపీ చేయడంలో లేదు. పెద్ద మాస్ సినిమా అంటే తప్పనిసరిగా డార్క్ వరల్డ్, బాధపడే జనాలు, వాళ్లపై విలన్ పెత్తనం, చివరికి వాళ్లకు అండగా నిలిచే హీరో అనే ఫార్ములా ఎక్కువైపోయింది. మధ్యలో తల్లి లేదా అన్నదమ్ముల సెంటిమెంట్, భారీ బీజీఎం, స్లో మోషన్ షాట్స్, రక్తపాతం కలిపేస్తే కొత్త ప్రపంచం తయారైనట్టు చూపిస్తున్నారు. కథలు మారుతున్నా చూసే అనుభవం దగ్గరగానే ఉంటుంది.

ప్యారడైజ్‌లో శ్రీకాంత్ ఓదెల తెలంగాణ నేపథ్యం, జడల్ లుక్, కొన్ని పాత్రలతో తన స్టైల్ తీసుకురావడానికి ట్రై చేశాడు. ఫస్ట్ 30 నిమిషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, జడల్ చిన్నప్పటి భాగం, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్‌లో వయలెన్స్, మాస్ ఎలివేషన్స్ ఎక్కువ కావడంతో కథ వెనక్కి వెళ్లిందనే టాక్ ఉంది. కేజీఎఫ్ తర్వాత మొదలైన ఈ మాస్ టెంప్లేట్‌కు ఇప్పుడు కొత్త రూపం కంటే కొత్త కథ అవసరం కనిపిస్తోంది. మరి నెక్ట్స్ రాబోయే డ్రాగన్ లాంటి సినిమాలు కొత్త కిక్ ఇస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News