నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ మూవీ
నవంబర్ నెల మొదట్లో థియేటర్లలో రిలీజైన తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రివ్యూలే వచ్చాయి.;
నవంబర్ నెల మొదట్లో థియేటర్లలో రిలీజైన తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రివ్యూలే వచ్చాయి. ఈ సినిమా రిలీజై నెల రోజులు కాకముందే డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
డిసెంబర్ 5న ఓటీటీలోకి..
డిఫరెంట్ స్టోరీతో నవంబర్ 7న రిలీజైన ఈ తెలుగు కామెడీ డిసెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ రన్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షో ఎన్నో నవ్వులను పూసుకుంటూ జీ5లోకి వస్తుంది, ఈ ఫన్ ట్రైలర్ తో రెడీగా ఉండండి అంటూ జీ5 సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేయగా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మసూద మూవీతో మంచి హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటించిన మరో కామెడీ ఎంటర్టైనరే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాలో తిరువీర్ రమేష్ అనే ఫోటోగ్రాఫర్ గా కనిపించి ఆకట్టుకున్నారు. అతని అసిస్టెంట్ ఓ ముఖ్యమైన మెమొరీ కార్డ్ పోగొట్టడంతో రమేష్ కు అసలు సమస్యలు మొదలవుతాయి. ఓ పొలిటీషియన్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వీడియో అది. అలాంటి ఇంపార్టెంట్ వీడియో మిస్ అవడంతో రమేష్ భయంతో ఓ అబద్ధం చెప్పి ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయాలనుకుంటాడు. ఆ అబద్ధం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జరగడంతో ఆ నేపథ్యంలో ఎదురయ్యే కామెడీ ఆడియన్స్ ను బాగా అలరించింది.
ప్రతీ సీన్ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చింది
ఈ సినిమాలో రమేష్ క్యారెక్టర్ చేయడం తనకు ఓ చిన్న పల్లెటూరు వ్యక్తి లైఫ్ లోకి అడుగుపెట్టినట్టే అనిపించిందని, అతని భయం, ఇన్నోసెన్స్, తప్పును సరిచేసే ప్రయత్నాలు సినిమాలో చాలా బాగా పండాయని, ప్రతీ సీన్ తనకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చిందని చెప్పగా, ఈ సినిమా రియల్ క్యారెక్టర్లతో చాలా సింపుల్ గా, ప్రతీ సీన్ చాలా నేచురల్ గా అనిపించిందన్నారు.