ప్రీ వెడ్డింగ్ షో.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

ముఖ్యంగా తిరువీర్ తనదైన కామెడీ టైమింగ్‌ తో అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి. సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచారు.;

Update: 2025-11-10 14:12 GMT

మసూద, పలాస వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్.. రీసెంట్ గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కంప్లీట్ కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.




 



టాలెంటెడ్ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించగా.. అగరం సందీప్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే నైజాంలో మైత్రీ సంస్థ రిలీజ్ చేయగా.. ఆయా చోట్ల పలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు గ్రాండ్ గా విడుదల చేశాయి. అయితే రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్.. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. పాజిటివ్ వైబ్స్ ను నెలకొల్పింది.

అందుకు తగ్గట్టే మూవీ ఇప్పుడు సినీ ప్రియులను అలరిస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌ లో వచ్చిన అత్యుత్తమ కామెడీ చిత్రాల్లో ఒకటిగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని అంతా చెబుతున్నారు. అసభ్యత, బూతులు లేకుండా, నాచురల్ కామెడీతో మెప్పిస్తుందని అంటున్నారు. కడుపుబ్బా నవ్విస్తోందని రివ్యూస్ ఇస్తున్నారు.

ముఖ్యంగా తిరువీర్ తనదైన కామెడీ టైమింగ్‌ తో అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి. సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచారు. డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ డెబ్యూ మూవీతోనే తన వర్క్ తో మెప్పించారు. తన కథనం, మేకింగ్ తో ఆకట్టుకున్నారు. ఏదేమైనా చిన్న మూవీగా విడుదలైన ప్రీ వెడ్డింగ్ షో సినిమా పెద్ద విజయం సాధించేలా కనిపిస్తోంది.

మొన్న ఫ్రైడే సినిమా విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మంచి టాక్ తో సినిమా ఒకో రోజు కంటే ఎక్కువ మరో రోజు వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు మూడు రోజులకు గాను రూ.2 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ విషయాన్ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ప్రకటించారు.

"చిన్నగా మొదలైంది, కానీ ప్రేమ అపారమైనది. ప్రీ వెడ్డింగ్ షో రూ.2.2 కోట్లను 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. నిజమైన బ్లాక్‌ బస్టర్ ఫన్ షో. ఈరోజు నుండి మరిన్ని స్క్రీన్‌ లలో సినిమా అందుబాటులోకి వచ్చింది" అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. అయితే మంచి రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ థియేటర్స్ ను పెంచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఓవరాల్ గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News