మరోసారి హాట్ టాపిక్ గా 'ది గర్ల్‌ ఫ్రెండ్'.. చిన్మయి రాహుల్ అలా అనేశారేంటి?

ఒక పురుషుడిగా సమాజంలో ఉన్న తన పవర్స్ వల్ల తనకు కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయని, అందుకే ఆ అంశాన్ని చెప్పాల్సిన బాధ్యతగా భావించానన్నారు.

Update: 2026-06-26 03:49 GMT

నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, సింగర్ ఆర్టిస్ట్ చిన్మయి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. మహిళలు, పురుషులపై జరిగే నేరాలు, సమాజంలో ఉన్న డిఫరెన్సెస్, తన సినిమా ది గర్ల్‌ ఫ్రెండ్ ఉద్దేశంపై రాహుల్ చేసిన పోస్టును చిన్మయి షేర్ చేస్తూ భర్తకు సపోర్ట్ గా నిలిచారు. "రాహుల్‌ లాంటి పర్సన్ దొరికితేనే పెళ్లి చేసుకోండి. లేదంటే మ్యారేజ్ చేసుకుని బాధపడొద్దు. మిగతా విషయం మీ ఇష్టం.. మీ జీవితం" అంటూ రాసుకొచ్చారు.

అయితే రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద 2013లో విడుదలైన అందాల రాక్షసి సినిమా ప్రీమియర్ షోలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఆ పరిచయం ప్రేమగా మారి, కుటుంబ సభ్యుల అంగీకారంతో 2014 మేలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ది గర్ల్‌ ఫ్రెండ్ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన పోస్టుకు రాహుల్ స్పందించారు.

"నాకు అన్నీ తెలుసని నేను చెప్పడం లేదు. నేను తప్పు అయితే వివరించండి. కానీ మహిళలు పురుషులపై దాడులు చేస్తున్నారని నేను చూడడం లేదు. కొంతమంది మహిళలు నేరాలకు పాల్పడవచ్చు. అది వ్యక్తిగత నేరం. కానీ మహిళల జీవితాలను అణచివేసే సామాజిక వ్యవస్థ మాత్రం వేరే అంశం" అని ఆయన పేర్కొన్నారు. తాను చూసిన అనేక మంది మహిళలు నిశ్శబ్దంగా ఇలాంటి పరిస్థితులను భరించారని, అదే కోణాన్ని ది గర్ల్‌ ఫ్రెండ్ కథలో చూపించే ప్రయత్నం చేశానని రాహుల్ వివరించారు.

ఒక పురుషుడిగా సమాజంలో ఉన్న తన పవర్స్ వల్ల తనకు కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయని, అందుకే ఆ అంశాన్ని చెప్పాల్సిన బాధ్యతగా భావించానన్నారు. అలాగే ప్రస్తుతం చర్చలో ఉన్న ఓ మహిళ చేసిన నేరం గురించి పూర్తిగా చదవలేదని, చదివిన తర్వాత చెప్పదగ్గ కథగా అనిపిస్తే దానిపైనా సినిమా తీసే అవకాశం ఉందన్నారు. అయితే అది ఒక మహిళ చేసిన నేరం గురించే ఉంటుందని, మహిళలు పురుషులపై చేసే నేరాల గురించి నార్మల్ గా చెప్పడం కాదని స్పష్టం చేశారు.

ఆ రెండింటికీ తేడా ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో విక్రమ్ పాత్ర హంతకుడు కాదని, అత్యాచారం చేసే వ్యక్తి కాదని, ఫిజికల్ వైలెన్స్ కూడా ఉండదని చెప్పారు. అయినప్పటికీ కొందరు ఆ పాత్రను చూసి ఎందుకు అసౌకర్యంగా ఫీలవుతున్నారో ఆలోచించాలని రాహుల్ సూచించారు. ఎవరికైనా తన అభిప్రాయాలతో విభేదాలు ఉంటే ప్రశ్నించడం మంచి విషయమేనని, అలాంటి విమర్శలను తీసుకుంటానని పేర్కొన్నారు.

రాహుల్ క్లారిటీకి చిన్మయి మద్దతు తెలపడం సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది. కొందరు ఆమె వ్యాఖ్యలను ప్రశంసిస్తుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ది గర్ల్‌ ఫ్రెండ్ మూవీ విడుదలైన తర్వాత కూడా దాని చుట్టూ చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా మెసేజ్, దానిపై అభిప్రాయాలు, దర్శకుడి క్లారిటీతో సినిమా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News