• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తంగలాన్ టీజర్​.. మరీ ఇంత...

తంగలాన్ టీజర్​.. మరీ ఇంత భయంకరంగానా?

| ఏ పాత్రనైనా తనదైన శైలిలో నటించి అభిమానులను సొంతం చేసుకుంటారు చియాన్‌ విక్రమ్‌. భిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు

By - Tupaki Desk
Update: 2023-11-01 07:34 GMT

ఏ పాత్రనైనా తనదైన శైలిలో నటించి అభిమానులను సొంతం చేసుకుంటారు చియాన్‌ విక్రమ్‌. భిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్​ విడుదలై ఓ వైపు ఆసక్తి పెంచుతూనే మరోవైపు మరీ వైల్డ్​గా ఉంది.


ఇప్పటికే సినిమాలో విక్రమ్‌ గెటప్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త తరహాలో ఉండనుందని ఫస్ట్ లుక్​ ద్వారా తెలిసింది. చిత్రంలోని విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలు విడుదలై ఆసక్తిని రేకెత్తించాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రచార చిత్రాల్లో బంగారు గనుల దగ్గర ఉండే గ్రామాల్లోని మనుషులు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలను భయంకరంగా చూపించారు. ముఖ్యంగా విక్రమ్​ను మరింత భయంకరంగా చూపించారు. కత్తి పట్టుకొని ఎదురొచ్చే వాళ్లని నరికేస్తూ, ఓ సీన్​లో అయితే చేత్తోనే పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు వైల్డ్​గా చూపించారు.

బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అని తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నారు. విక్రమ్ గెటప్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ప్రచార చిత్రం చివర్లో.. రక్తపాతం జరిగే యుద్ధాలతో స్వేచ్ఛ లభిస్తుంది. సన్​ ఆఫ్ గోల్డ్​ ఉదయిస్తున్నాడు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఒక్క డైలాగ్ కూడా లేని ఈ ప్రచార చిత్రం సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

మొత్తంగా సినిమా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని అర్ధమౌతోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్‌, నీలం ప్రొడక్షన్‌ సంస్థల పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ స్వరాలందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ బహుళ, విదేశీ భాషల్లో రిలీజ్​కు రెడీ అవుతోంది.

Full View
Tags:    
  • Thangalaanteaser 
  • Chiyaanvikram 
  • Kegnanavelraja 
  • Paranjith 
  • Gvprakashkumar 
  • Thangalaanmovie 
  • Malavikamohanan 
  • Parvathy 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS