నితిన్ ఫ్రీగా చేస్తున్నాడా..?

ఇప్పుడు ఎల్లమ్మకు కూడా దాదాపు అంతే బడ్జెట్ అయ్యేలా ఉంది. మరి ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తారని చర్చిస్తున్నారు.;

Update: 2025-07-13 03:30 GMT

తమ్ముడు సినిమా ఇచ్చిన షాక్ తో అటు దిల్ రాజు ఇటు హీరో నితిన్ నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. ఫ్లాపుల్లో ఉన్నా కూడా దిల్ రాజు నితిన్ కు తమ్ముడు ఇచ్చాడు. ఈ సినిమా నాని కాదనడం అలా నితిన్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం సినిమా వర్క్ అవుట్ కాకపోవడం ఇదంతా అలా జరిగిపోయింది. తమ్ముడు సినిమా మీద దిల్ రాజు రిలీజ్ ముందు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగా.. రాజు గారి మాట మీద నమ్మకం ఉంచిన ఆడియన్స్ ఏంటి ఆయన జడ్జిమెంట్ కూడా తప్పిందే అనుకున్నారు.

ఇక ఎల్లమ్మ కాలిక్యులేషన్స్ లో తమ్ముడుతో నితిన్ ఎలాగు హిట్ కొడతాడు.. బలగం తో వేణు ఆల్రెడీ సక్సెస్ ఈ ఇద్దరు కలిస్తే మరో సూపర్ హిట్ సినిమా పడుతుందని తమ్ముడు రిలీజ్ ముందు ప్రమోషన్స్ లో చెప్పారు. అంటే తమ్ముడు హిట్ కాలేదు మరి ఎల్లమ్మ పరిస్థితి ఏంటంటూ ఆడియన్స్ అంటున్నారు.

మరోపక్క తమ్ముడు హిట్ అయితే ఎల్లమ్మ అనుకున్న విధంగా సాఫీగా వెళ్లేది. కానీ ఆ సినిమా రిజల్ట్ ఎల్లమ్మ మీద పడేలా ఉంది. వేణు ఐతే తాను అనుకున్న బడ్జెట్ తో అయితేనే సినిమా సోల్ మిస్ అవ్వకుండా చేస్తానని కరాకండిగా చెప్పేశాడట. ఐతే నితిన్ విషయంలోనే దిల్ రాజు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.

తమ్ముడు సినిమా బాగా ఖర్చు వస్తుందని షూటింగ్ టైం లోనే నితిన్ రెమ్యునరేషన్ కూడా తగ్గించి ప్రాజెక్ట్ పూర్తి చేశారు. ఇప్పుడు ఎల్లమ్మకు కూడా దాదాపు అంతే బడ్జెట్ అయ్యేలా ఉంది. మరి ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తారని చర్చిస్తున్నారు. ఐతే ఎల్లమ్మ సినిమాకు నితిన్ ఫ్రీగా చేసే అవకాశాలు ఉన్నాయట. ఎలాగు తమ్ముడు ఫ్లాపైంది కాబట్టి ఎల్లమ్మ సినిమా ఫ్రీగా చేసి ఆ సినిమా ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు దిల్ రాజు ఇచ్చినంత రెమ్యునరేషన్ గా పొందాలని నితిన్ అనుకుంటున్నాడట.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఒక నిర్మాతే కాబట్టి ఆయనకి ఈ కాలిక్యులేషన్స్ నిర్మాత కష్టాలు తెలుసు.. సో నితిన్ ఎల్లమ్మ ఫ్రీగా చేయడానికి ఆయన కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇక్కడ రెమ్యునరేషన్ కన్నా నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ముఖ్యం కాబట్టి ఎల్లమ్మ కి నితిన్ అడిగినన్ని డేట్స్ ఫ్రీగా ఇచ్చేయాలని అనుకుంటున్నాడట.

ఎల్లమ్మ కోసం నితిన్ 5 నెలలు ఒక్కో నెల 20 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఐదు నెలల్లో సినిమా పూర్తి చేసి మరో రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఎల్లమ్మ రిలీజ్ చేస్తారట. 2026 సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో ఎల్లమ్మ సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News