• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం.. తమన్...

గుంటూరు కారం.. తమన్ మౌనమేల?

| సోషల్ మీడియాతోపాటు ఈవెంట్స్ లో స్పీచ్ లతో అదరగొట్టే తమన్.. సర్ ప్రైజింగ్ గా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సైలంట్ అయిపోయారు.

By - Tupaki Desk
Update: 2024-01-10 05:31 GMT

కిక్ మూవీతో సోలో మ్యూజిక్ డైరెక్టర్ మారారు ఎస్ ఎస్ తమన్. పలు టాలీవుడ్ సినిమాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి పాపులర్ అయ్యారు. తెలుగులో దాదాపుగా టాప్ హీరోలందరి సినిమాలకు సంగీతం అందించారు. గతేడాది ఐదారు సినిమాలకు మ్యూజిక్ అందించిన తమన్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

అయితే 2023లో అనేక పాటలకు సంగీతమందించినా.. విమర్శలు కూడా అలానే ఎదుర్కొన్నారు. క్యాపీ మ్యూజిక్ అంటూ సినీ ప్రియులు తెగ ట్రోల్ చేశారు. ఆ తర్వాత గుంటూరు కారం సినిమాకు తమన్ పేరును మేకర్స్ ఖరారు చేసినప్పుడు.. మహేశ్ అభిమానులు కూడా ఆ డిసెషన్ ను వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేయాలని డిమాండ్ చేశారు. కానీ చిత్రయూనిట్ మాత్రం.. తమన్ కు సపోర్ట్ గా ఉంది.

ఇక మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా.. మేకర్స్ పాటలు విడుదల చేశాక కూడా తమన్ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ధమ్ మసాలా సాంగ్ కు ఎలాంటి వ్యతిరేకత రాకపోయినప్పటికీ.. ఓ మై బేబీతో పాటు కుర్చీ మడత పెట్టి పాటలకు తమన్ ను మహేశ్ ఫ్యాన్సే ట్రోల్ చేశారు. మహేశ్- త్రివిక్రమ్ సినిమాకు తగ్గ పాటలు కాదని కామెంట్లు చేశారు.

అయితే ఈ విమర్శలపై తమన్.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పందిస్తారని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాతోపాటు ఈవెంట్స్ లో స్పీచ్ లతో అదరగొట్టే తమన్.. సర్ ప్రైజింగ్ గా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సైలంట్ అయిపోయారు. నేను ఒక ట్వీట్ మాత్రం చేస్తాను. అంతకు మించి ఏం మాట్లాడను అని చెప్పేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సాధారణంగా తమన్ ప్రతీ మూవీ ఈవెంట్ సమయంలో చిత్రయూనిట్ తో తన అనుభవాన్ని పంచుకుంటుంటారు. ప్రతీ నటుడి కోసం చెప్తూ ఆకట్టుకుంటారు. ఆ సమయంలో కూడా తమన్ ట్రోల్స్ కు గురయ్యారు. ఏ టెక్నీషియన్ అయినా తాము పనిచేసే హీరోని పొగడుతారని, కానీ తమన్ అనవసరంగా అందరినీ పొగుడుతాడని ట్రోల్ వచ్చాయి.

అయితే ఈసారి ఇలా ట్రోల్స్ కు గురవ్వకూడదనే తమన్ సైలంట్ గా ఉన్నారని టాక్ వస్తోంది. చిత్ర యూనిట్ మాత్రం తమన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెబుతోంది. పగలూ రాత్రి కష్టపడి మ్యూజిక్ వర్క్ పూర్తి చేశారని అంటోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 12న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Tags:    
  • Gunturkaram 
  • Gunturkarammovie 
  • Maheshbabu 
  • Ssthaman 
  • Prerelease 
  • Event 
  • Performance 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS