థ‌మ‌న్ స్ట‌డీ 6 వ త‌ర‌గ‌తితోనే మంగ‌ళం!

ప్ర‌భుత్వ ఉద్యోగాలు..సాప్ట్ వేర్ ఉద్యోగాలు స‌హా చాలా ర‌కాల ఉద్యోగాలు...ప‌ద‌వులు సైతం వ‌దిలేసి సినిమాల‌పై ఫ్యాష‌న్ కొన‌సాగుతోన్న వారెంతో మంది. మ‌రి థ‌మ‌న్ ఎంత చ‌దువుకున్నాడు.;

Update: 2025-08-12 19:30 GMT

థ‌మ‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. సంగీత ద‌ర్శ‌కుడిగా తెలుగులో ఓ సంచ‌ల‌నం. స్టార్ హీరోల సిని మాలన్నింటికీ అత‌డే మ్యూజిక్ అందిస్తున్నారు. బాల‌య్య ఆ స్థాన సంగీత ద‌ర్శ‌కుడిగా మారిపోయారు. ఇండ‌స్ట్రీలో థ‌మ‌న్ కి ఎవ‌రు అవ‌కాశాలిచ్చినా? ఇవ్వ‌క‌పోయినా బాల‌య్య మాత్రం ఇస్తారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య అంత‌టి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఈ మ‌ధ్య కాలంలో బాల‌య్య సినిమాల‌న్నింటికి వ‌రుస‌గా థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య త‌దుప‌రి సినిమాల‌కు అత‌డే స్వ‌ర‌కర్త‌.

ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే? సినిమా వాళ్లు అంటే దాదాపు అంద‌రూ బాగా చ‌దువుకున్న వాళ్లే క‌నిపిస్తారు. పాత త‌రం న‌టుల‌కంటే పెద్ద‌గా చ‌దువుండేది కాదు. కానీ నేటి జ‌న‌రేష‌న్ న‌టులైతే అంతా బాగా చ‌దు వుకున్న వారే పెద్ద పెద్ద చ‌దువులు చ‌దువుకుని సినిమాల‌పై ఆశ‌తో వ‌చ్చి స్థిర‌ప‌డిన వారెంతో మంది. ప్ర‌భుత్వ ఉద్యోగాలు..సాప్ట్ వేర్ ఉద్యోగాలు స‌హా చాలా ర‌కాల ఉద్యోగాలు...ప‌ద‌వులు సైతం వ‌దిలేసి సినిమాల‌పై ఫ్యాష‌న్ కొన‌సాగుతోన్న వారెంతో మంది. మ‌రి థ‌మ‌న్ ఎంత చ‌దువుకున్నాడు.

ఇంజ‌నీరింగ్ పూర్తి చేసాడా? డిగ్రీ చ‌దివాడా? లేక ఇంకా హ‌య్య‌ర్ స్ట‌డీస్ నా? అంటే చాలా మంది థ‌మ‌న్ బాగా చ‌దువుకునే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడ‌నుకుంటున్నారు. కానీ థ‌మ‌న్ చ‌దువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును థ‌మ‌న్ డిగ్రీ చ‌ద‌వ‌లేదు. ఇంజ‌నీరింగ్ పూర్తి కాదు క‌దా? క‌నీసం ప‌ది కూడా పాస్ అవ్వ‌లేదు. అత‌డు ఆర‌వ త‌ర‌గ‌త‌తితోనే చ‌దువుకు మంగ‌ళం పాడేసిన‌ట్లు తెలిపారు. చిన్న‌ప్ప‌టి నుంచే చ‌దువు త‌ల‌కెక్క‌లేద‌న్నారు. `ఇంట్లో ఎటూ చూసినా డ్ర‌మ్స్ ఉండేవి. చిన్న‌ప్పుడే వాటిని వాయించ‌డం అల‌వాటు చేసుకున్నా.

దీంతో స్కూల్లో టీచ‌ర్లు మోకాళ్ల‌పై కూర్చెబెట్టేవారు.చ‌దువుకంటే క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ‌గా ముం దుండేవాడిని. జాగ్ర‌ఫీ త‌ప్ప మిగ‌తా స‌బ్జెక్ట్ లు అన్ని ఫెయిల‌య్యేవాడిని. స్కూల్ ఫంక్ష‌న్స్ లో యాక్టివ్ గా ఉండ‌టంతో పాస్ మార్కులు వేసి పంపిం చేవారు. నాన్న‌గారి డ్ర‌మ్స్ తోనే ఆనుకునేవాడిని. బొమ్మ‌లు కొనిచ్చే ప‌రిస్థితి అప్పుడు లేదు. ల‌గ్జ‌రీ లైఫ్ అంత‌క‌న్నా లేదు. డ్ర‌మ్స్ అలా అల‌వాటుగా మారింది. రాత్రికి ఇంటికి డ్ర‌మ్స్ చేరిన వెంట‌నే వాయించే వాడిని. అదే నాకు ఎంతో హాయినిచ్చేది` అన్నారు.

Tags:    

Similar News