• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ కోసం టాలీవుడ్...

విజయ్ కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఇదెక్కడి ట్విస్ట్?

| ఇళయదళపతి విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టిన తర్వాత సినిమాలు మానేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2024-02-17 06:37 GMT

ఇళయదళపతి విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టిన తర్వాత సినిమాలు మానేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రజాసేవలోనే తన ప్రయాణం అని విజయ్ కన్ఫర్మ్ చేసేశారు. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT అనే మూవీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో టైం ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మూవీలో విజయ్ రెండు భిన్నమైన టైం లైన్స్ లో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత విజయ్ కాల్ షీట్స్ కోసం ఏకంగా ఐదు మంది దర్శకుల వరకు సిద్ధంగా ఉన్నారు. ఓ నాలుగు సీక్వెల్స్ కూడా సెట్స్ పైకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే విజయ్ మాత్రం ఇకపై సినిమాలు చేసేది లేదని తేల్చేశాడు.

అతని చివరి సినిమా డివివి దానయ్య నిర్మాణంలో ఉండనుందట. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో దానయ్య ఈ మూవీని నిర్మించనున్నారంట. ఇకపోతే మూవీ కోసం దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దానయ్య సంప్రదింపులు జరుపుతున్నారంట. విజయ్ కి సరిపోయే కథని సిద్ధం చేయాలని అడిగినట్లు టాక్.

త్రివిక్రమ్ కి కూడా విజయ్ తో మూవీ అంటే కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి మంచి స్కోప్ దొరికినట్లు అవుతుంది. ఒకవేళ ఈ మూవీ చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పుకుంటే మాత్రం కచ్చితంగా అది పెద్ద ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విజయ్ మార్కెట్ ని పాన్ ఇండియా బ్రాండ్ ని దృష్టిలో ఉంచుకొని యూనివర్శల్ గా రీచ్ అయ్యే కథని గురూజీ సిద్ధం చేయాల్సి ఉంటుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాకుంటే కోలీవుడ్ లో స్టార్ దర్శకుడితో ఈ మూవీ చేసే ఛాన్స్ అయితే ఉంది. విజయ్ మాత్రం తన చివరి సినిమా రాజకీయంగా తనని ప్రజలకి చేరువ చేసే సోషల్ ఎలిమెంట్స్ తో ఉండాలని బలంగా కోరుకుంటున్నారంట. మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు తప్ప పెద్దగా గ్రాండ్ లెవెల్లో సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేయలేదు.

మరి విజయ్ కోసం అయిన తన పెన్నుకి పదును పెట్టి డిఫరెంట్ గా థింక్ చేస్తారేమో అనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ లిస్టులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు సడన్ గా దానయ్య - త్రివిక్రమ్ తో సంప్రదింపులు జరిపినట్లు టాక్ మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Tags:    
  • Vijay 
  • Dvv 
  • Danayya 
  • Trivikram 
  • Venkataprabhu 
  • Goat 
  • Politicalentry 
  • Kollywood 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS