• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దళపతి 69 లాంచ్.....

దళపతి 69 లాంచ్.. ఆరంభంలోనే భారీగా..

| కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-04 13:44 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం దళపతి 69 ఘనంగా ప్రారంభమైంది. ఈ భారీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు నవరాత్రి రెండవ రోజున నిర్వహించబడినట్టు మేకర్స్ వెల్లడించారు. విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్ పట్ల ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.


పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు. వారికి సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ కూడా విడుదల చేశారు. పొలిటికల్ ఎంట్రీ కి ముందు సిల్వర్ స్క్రీన్ పై చివరిసారిగా విజయ్ కనిపించబోతున్న ఈ చిత్రం, ఆయన అభిమానులకు ఒక ఎమోషనల్ ప్రాజెక్ట్ గా మారింది. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు కూడా తాము ఈ ప్రాజెక్ట్‌పై ఎంత కష్టపడుతున్నారో వెల్లడించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ గతంలో మాస్టర్, ధీరన్ సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నారు. అందువల్ల ఈ సినిమాను కూడా మరింత రిచ్‌గా, అద్భుతంగా చూపించనున్నట్లు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, పల్లవి సింగ్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర సాంకేతిక విభాగాలు కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. 2025 అక్టోబర్‌లో పాన్ ఇండియా స్థాయిలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విజయ్ తన సినీ ప్రయాణాన్ని ముగించుకునే ఈ ప్రాజెక్ట్, ఆయన లెగసీకి సరిపడే విధంగా గ్రాండ్‌గా రూపొందిస్తున్నారని మేకర్స్ తెలిపారు.

దళపతి 69 విజయ్ కెరీర్‌లో మరుపురాని సినిమా అవుతుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇక ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, వెటరన్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, మలయాళ బ్యూటీ మమిత బైజు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పట్ల కోలీవుడ్‌తో పాటు, ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pictures layum seri adha paathutu iruka unga face layum seri HAPPY SMILES irukunu we know ♥️#Thalapathy69Poojai stills SET 1 idhoo 🔥

Updates inum mudiyala.. SET 2 incoming 💥#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain… pic.twitter.com/FW8l2G1yNJ

— KVN Productions (@KvnProductions) October 4, 2024
Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Thalapathy69 
  • Poojaceremony 
  • Vijaythalapathy 
  • Poojahegde 
  • Bobbydeol 
  • Gauthammenon 
  • Priyamani 
  • HVinoth 
  • KVNproductions 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS